నాగ‌బాబుకు ఇవ్వాల‌నుకున్న కార్పొరేష‌న్ ప‌ద‌వి ఏదంటే?

ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి అందుతున్న విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం నాగ‌బాబుకు కార్పొరేష‌న్ ప‌ద‌వే ఇవ్వాల‌ని అనుకున్నార‌ట‌.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌, జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబుకు ఎమ్మెల్సీకి బ‌దులు, కీల‌క‌మైన కార్పొరేష‌న్ ప‌ద‌వి ఇస్తార‌నే చ‌ర్చ‌ను టీడీపీ అనుకూల ప‌త్రిక క‌థ‌నం రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే అలాంటిదేమీ లేద‌ని, నాగ‌బాబు ఎమ్మెల్సీగా రాబోతున్నారంటూ జ‌న‌సేన అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో పేర్కొన్నారు. కానీ ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి అందుతున్న విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం నాగ‌బాబుకు కార్పొరేష‌న్ ప‌ద‌వే ఇవ్వాల‌ని అనుకున్నార‌ట‌.

ఇటీవ‌ల జీవీరెడ్డి వ‌ద్ద‌ని రాజీనామా చేసిన ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌విని నాగ‌బాబుకు క‌ట్ట‌బెట్టాల‌ని టీడీపీ వ్యూహం ప‌న్నింది. అందులో అయితే ఆదాయం వుంటుంద‌ని, అదే ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడికి స‌రైన ప‌ద‌విగా టీడీపీ ఊరించే ప్ర‌య‌త్నం చేసింది. త‌న అన్న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌ద్ద‌ని ప‌వ‌నే చెప్పార‌ని ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌లో క‌థ‌నం రావ‌డం వెనుక టీడీపీ ముఖ్య నేత‌లున్నార‌ని జ‌న‌సేన అనుమానిస్తోంది. నాగ‌బాబు ప‌ద‌విపై ఎందుకిలా లీకులు ఇస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు.

కానీ ప్ర‌భుత్వ పెద్ద‌లు మాత్రం నాగ‌బాబుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌డానికి సుముఖంగా లేరు. టీడీపీలో ఆశావ‌హులు ఎక్కువ కావ‌డంతో, నాగ‌బాబుకు కాకుండా త‌మ పార్టీ నాయ‌కుల‌కే ఇవ్వాల‌నేది సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ ఆలోచ‌న‌గా ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు. నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తున్న‌ట్టు కొన్ని నెల‌ల క్రిత‌మే స్వ‌యంగా చంద్ర‌బాబే అధికారికంగా ప్ర‌క‌టించి, ఇప్పుడు ఎందుకు మ‌న‌సు మార్చుకున్నారో అనే చ‌ర్చ జ‌న‌సేన‌లో జ‌రుగుతోంది.

అందుకే వెంట‌నే జ‌న‌సేన తమ అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో నాగ‌బాబు నామినేష‌న్ వేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు అన్ని ప‌త్రాలు సిద్ధం చేసుకోవాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆదేశించార‌ని కూడా వెల్ల‌డించారు. నాగ‌బాబుకు ఎమ్మెల్సీ, అలాగే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి టీడీపీ అయిష్టంగా వుంద‌నే సంకేతాల్ని సొంత మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు రాయ‌డం ద్వారా సంకేతాల్ని పంపార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. చివ‌రికి నాగ‌బాబును ఏం చేస్తారో అని జ‌న‌సేన నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

15 Replies to “నాగ‌బాబుకు ఇవ్వాల‌నుకున్న కార్పొరేష‌న్ ప‌ద‌వి ఏదంటే?”

  1. ఇలా కూడా ఆర్టికల్స్ రాయొచ్చా. ఇపుడే ఇక్కడ 3 ఆర్టికల్స్ చదివా నాగ బాబు mlc పైన. ఒకదానికి ఒకటీ అసలు సంబంధమే లేదు.

  2. అన్న తమ్ముడు ప్రజలని ఉద్ధరించే రకాలు కాదు ఏ పార్టీ తో ఉంటె అ పార్టీ రంగు బట్టలు వేసుకుంటారు. కాపులు కూడా విజ్ఞత కోల్పోయి ఎదో పవన్ కళ్యాణ్ ఒడిపోతే మేము ఓడిపోతాము అనే ఎమోషన్ లో కి వెళ్లి గెలిపించారు. ఒకప్పటి రాజ్యాలు రాజులు లేరు. ఎవరు గెలిచినా అందరు కులాల సమూహం లో ఉండాలి. పవన్ గెలిస్తే కాపులకు వేరే దేశం ఇయ్యరు లేదా ఉద్యోగ అవాకాశాల్లో లేద ఎడ్యుకేషన్ లో ఫ్రీ సీట్ ఇవ్వరు. బస్సు ల్లో రైళ్లలో ఎప్పటి లాగా నరకం అనుభవిస్తూ ప్రభుత్వాల్ని తిట్టుకుంటో బ్రతకడమే. మీ జీవన ప్రమాణాలు విద్య వైద్య నిత్యావసరాలు రిసొనాబుల్ గ అందించే నాయకుడిని కలిగిన ఏ పార్టీ ని అయినా ఎన్నుకోండి.

    1. Nijame …mari jaganmohan reddi, y v subbareddi, peddhi reddi, karunakar reddi, chevireddi baskar reddi, sajjalaramakrishna reddi….valla naluguri kodukulu, vijayasaireddi, darmareddi, buggana rajendranadh reddi, Rojareddy, Y S Avinash reddi, midhun reddy ilaa chuttu REDLA ne yedhuku pettukunnaru 5 samvathsaraalu.

    1. నాగబాబు కి మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు సంతకం తో టీడీపీ లెటర్ హెడ్ మీద ఇచ్చారు, కానీ చంద్రబాబు నీ నమ్మలేము

  3. చెత్త మీద చెత్త పన్ను తీసేసారా ?

    లేక ఆ చెత్త ని తెచ్చి ఇంట్లో వేసుకుంటున్నారా??

  4. అయితే స్నేక్ బాబు కూతురు ఈసారి ఇంట్లోనే ఉగాది పచ్చడి అందరికి తినిపిస్తుంది.

Comments are closed.