అనిరుధ్ రెమ్యునరేషన్.. హమ్మో!

లేటెస్ట్‌గా చేయబోయే నాని-శ్రీకాంత్ ఓదెల “పారడైజ్” సినిమాకు అనిరుధ్ రెమ్యునరేషన్ 15 కోట్లు.

యువ సంగీత సంచలనం అనిరుధ్. ఇతగాడంటే మన తెలుగు హీరోలకు అదో క్రేజ్. నిర్మాతలకు బేజారు. దర్శకులకు టెన్షన్. ఎందుకంటే కంటెంట్ ఎప్పుడు వస్తుందో అసలు క్లారిటీ ఉండదు. కళ్లంట నెత్తురు కారినా స్పందన ఉండదన్నది అతనితో వర్క్ అనుభవం ఉన్న వాళ్ల మాట. కానీ క్వాలిటీ కంటెంట్, క్రేజీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటుందని అనిరుధ్ కావాలనుకుంటారు.

ఇక్కడే మరో మాట కూడా ఉంది. తమిళ సినిమాలకు ఇచ్చిన క్వాలిటీని తెలుగు సినిమాలకు ఇవ్వడం అరుదు అని టాక్. కానీ ఎంతయినా అనిరుధ్ పని చేసిన తెలుగు సినిమాల్లో ఏదో ఒక హుక్ సాంగ్, హుక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటాయి. అవి అలా చాలా కాలం ట్రెండ్‌లో నిలబడతాయి.

మొత్తం మీద అనిరుధ్ క్రేజ్ అలా ఉంది. అందుకే అతని రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో పెరుగుతోంది. ప్రస్తుతం అనిరుధ్ రెమ్యునరేషన్ 15 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. లేటెస్ట్‌గా చేయబోయే నాని-శ్రీకాంత్ ఓదెల “పారడైజ్” సినిమాకు అనిరుధ్ రెమ్యునరేషన్ 15 కోట్లు.

నిజానికి కాస్త డిఫరెంట్‌గా చేసే ఇతర భాషా సంగీత దర్శకులను ఎవరిని ట్రై చేసినా కనీసం 10 నుంచి 12 కోట్ల బడ్జెట్ తేడా వస్తుంది. కానీ అలా చేయరు కదా!

అలా అని అనిరుధ్ పేరు వల్ల ఆడియో రైట్స్ ఆదాయం భయంకరంగా వచ్చేస్తుందా? అంటే అది కూడా లేదు. మహా అయితే 20 కోట్లు రావడం గొప్ప. అంటే ఆడియో ఆదాయం, ఆడియో ఖర్చు రెండూ సమానం అన్నమాట.

2 Replies to “అనిరుధ్ రెమ్యునరేషన్.. హమ్మో!”

Comments are closed.