ఇన్‌సైడర్‌కు రాజధానికి లింకుందా?

ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే పదం ఇప్పుడు చాలా ముమ్మరంగా వినిపిస్తోంది. అమరావతి ప్రాంతంలో  తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించడమూ… మీరు మాత్రం తక్కువ తిన్నారా?…

ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే పదం ఇప్పుడు చాలా ముమ్మరంగా వినిపిస్తోంది. అమరావతి ప్రాంతంలో  తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించడమూ… మీరు మాత్రం తక్కువ తిన్నారా?

మీ వాళ్లు కూడా ఇదే అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు కదా…మా వాళ్లు ఏదో ఒక గజం జాగా కొంటే..  మీవాళ్లు ఎకరాల్లో కొన్నారు..అంటూ తెలుగుదేశం వారు ఎదురు విరుచుకుపడడమూ జరుగుతోంది. ‘‘అమరావతి రాజధాని- 3 రాజధానులు’’  అనే అవసరమైన సబ్జెక్టును వదిలేసి.. పక్కకునెట్టి.. అందరూ ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే నిష్ఫలమైన మాట గురించి కుస్తీలు పడుతున్నారు ఎందుకు?

ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది.. ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది గానీ.. ఇది చరిత్రలో కొత్త సంగతి కాదు. ఒక చోట రోడ్డు వస్తోందని ముందుగా తెలుసుకునే నాయకులు, వారి అనుచరులు.. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూములన్నిటినీ కారు చౌకగా కొనేసుకుని.. ఆ తర్వాత.. రోడ్డు వస్తుందనే నిర్ణయం అధికారికంగా ప్రకటించి..

హఠాత్తుగా పెరిగే ధరల దామాషాలో అవే భూములను అమ్మేసుకుని.. రాత్రికి రాత్రి కుబేరులు అయిపోయే ఘటనలు చరిత్రలో అనేకం. కాకపోతే.. ఇప్పుడు రాజధాని అతి పెద్ద రియల్ ఎస్టేట్ దందా.. సుమారు 55వేల ఎకరాల మేర నడిచింది గనుక.. ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది కూడా జాస్తిగానే జరిగింది.

తెలుగుదేశం నాయకులు ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసి.. అనుచితంగా లాభపడిపోతున్నారు గనుకనే.. అది చూసి ఓర్వలేక వైకాపా రాజధానిని అమరావతి నుంచి తప్పించి.. మూడు రాజధానుల ఆలోచన చేస్తున్నట్లుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అందుకే మీ వాళ్లు కూడా కొన్నారు కదా.. అని వైకాపా నాయకులు అమరావతి ప్రాంతంలో కొన్న భూముల లెక్కలు చెబుతున్నారు.

కానీ వారు తెలుసుకోవాల్సింది ఒకటుంది. 3 రాజధానులు అనేది కేవలం అధికార వికేంద్రీకరణ మాత్రమే. దానికి ఇన్‌సైడర్ కు సంబంధం లేదు. ఇన్‌సైడర్ లాలూచీ మోసాలు ఉంటే గనుక.. వాటి గురించి సీబీఐ నిగ్గు తేలుస్తుంది.

అటు తెదేపా, ఇటు వైకాపా ఎవరు భూములు కొని ఉన్నా.. మోసాలకు పాల్పడినట్లు తేలితే తదనుగుణంగా శిక్షలు అనుభవిస్తారు. అంతే తప్ప.. రాజధాని వ్యవహారంలో ఇన్‌సైడర్ బాగోతాల్ని కలిపేయడం అనేది.. సమస్యను పక్కదారి పట్టించడం మాత్రమే అవుతుంది. ఈ రెండు వ్యవహారాలు వేర్వేరు అని, ఒకదానికొకటి లింకు లేదని ప్రజలు గుర్తించాలి.

జాతకాలు మార్చేసిన 2019