షర్మిలను ప్రమోట్ చేస్తున్న వైసీపీ.. ఇదేమైనా గేమ్ ప్లాన్ నా…!?

వైఎస్ షర్మిల వైఎస్సార్ కుమార్తె. తండ్రి వారసత్వం కోసం ఆమె కూడా చూస్తున్నారు. అందుకే ఆమె తెలంగాణాలో రాజకీయ పార్టీని పెట్టారు. అయితే ఆ పార్టీని ఆమె నడపలేకపోయారు. కనీసం ఎన్నికల్లో తాను అయినా…

వైఎస్ షర్మిల వైఎస్సార్ కుమార్తె. తండ్రి వారసత్వం కోసం ఆమె కూడా చూస్తున్నారు. అందుకే ఆమె తెలంగాణాలో రాజకీయ పార్టీని పెట్టారు. అయితే ఆ పార్టీని ఆమె నడపలేకపోయారు. కనీసం ఎన్నికల్లో తాను అయినా పోటీ చేయలేదు. ఆ పార్టీని చాప చుట్టేసి కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇపుడు ఏపీలో ఆమె కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధినేతగా షర్మిల గత మూడు రోజులుగా హల్ చల్ చేస్తున్నారు. ఆమె పీసీసీ చీఫ్ అయినది లగాయితూ మీడియా హైప్ బాగానే ఉంటోంది. ఆమె వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. దానికి ప్రతి విమర్శలు కూడా వైసీపీ నుంచి వెళ్తున్నాయి. ఆమె బీజేపీ మీద ఘాటు విమర్శలు చేసినా ఆ పార్టీ అయితే రియాక్ట్ కావడం లేదు. వారు ఎందుకో తెలియదు మోడీ మీద బీజేపీ మీద షర్మిల చేసిన కామెంట్స్ ని కాషాయం పార్టీ నేతలు  అసలు పట్టించుకోవడంలేదు. సైలెంట్ గానే ఉంటున్నారు.

బహుశా షర్మిల కామెంట్స్ కి రియాక్ట్ కాకపోవడమే వారి వ్యూహం అయి ఉండాలి. ఇక చంద్రబాబు అమరావతి పేరు చెప్పి గ్రాఫిక్స్ అని జనాలకు చూపించారని ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని షర్మిల అన్నారు. అయినా కూడా టీడీపీ నుంచి విమర్శలు ఏవీ రాలేదు. వారు కూడా షర్మిల మాటలకు ఎందుకు బదులిచ్చి ఆమెను ప్రొజెక్ట్ చేయాలన్న ఆలోచనలో బహుశా ఉండి ఉండవచ్చు.

అయితే చిత్రంగా అధికార వైసీపీ మాత్రం ఆమె మాటలకు బాగానే రియాక్ట్ అవుతోంది. దాంతో గత మూడు రోజులుగా షర్మిల వైసీపీల మధ్యనే మాటల యుద్ధం సాగుతోంది. షర్మిల మాటలకు సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మంత్రులతో పాటు ఆఖరుకు ఉరవకొండలో సీఎం జగన్ కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన ఇండైరెక్ట్ గా ఎక్కడా పేరు పెట్టకుండా విమర్శించారు.

కానీ షర్మిల విషయంలో వైసీపీ అతిగా రియాక్ట్ ఎందుకు అవుతోంది అన్నదే ప్రశ్నగా ఉంది. నిజానికి చూస్తే ఏపీలో కాంగ్రెస్ ఏమీ బలంగా అయితే లేదు. షర్మిల వచ్చినంత మాత్రాన ఆ పార్టీ ఓవర్ నైట్ ఎదుగుతుందన్న ఆలోచనలూ లేవు. కానీ షర్మిలను ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ద్వారా ఏపీ పాలిటిక్స్ లో ఆమె గ్రాఫ్ పెంచే వ్యూహం ఏదైనా వైసీపీ అనుసరిస్తోందా అన్నదే చర్చగా ఉంది.

ఒక విధంగా చూస్తే షర్మిలను ప్రమోట్ చేయడానికి ఇదేమైనా గేమ్ ప్లాన్ నా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఇతర పార్టీలు అన్నీ కూడా కాంగ్రెస్ లో ఏమి జరుగుతోందో కూడా అంతగా పట్టించుకోవడం లేదు. ఫుల్ సైలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. కానీ వైసీపీ మాత్రమే గొంతు చించుకుంటోంది. రోజుకు పదుల సంఖ్యలో వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి షర్మిల మీద విమర్శలు చేస్తున్నారు.

ఈ విధంగా చేయడం ద్వారా షర్మిలను వారు కావాలనే పెంచుతున్నారు అని అంటున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లో ఉంది అని పదే పదే గుర్తు చేయడం కూడా ఈ విమర్శల ద్వారా జరుగుతోంది. మరి ఇదంతా కావాలని చేస్తున్నారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. నిజం చెప్పాలంటే వర్తమాన రాజకీయాలు ఏవీ రాజకీయ విశ్లేషకులకు కూడా అర్ధం కాకుండా ఉన్నాయి.

ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడని పాలిటిక్స్ ఇప్పుడు సాగుతోంది. వైరి పక్షం వైపు చూస్తూ పాలిటిక్స్ చేయడం అంటే ఇదే అనుకోవాల్సి ఉంటుంది. రాజకీయాల్లో ఎన్నో వ్యూహాలు ఉంటాయి. అలాగే రాజకీయ క్రీడలు ఉంటాయి. ఇపుడు వైఎస్ షర్మిల వైసీపీల మధ్య అలాంటి పొలిటికల్ గేమ్ ఏదైనా స్టార్ట్ అయిందా అన్నదే చర్చగా ఉంది. 

ఇప్పుడు అయితే ఇది చాలా ముందుగానే ఒక అభిప్రాయానికి రావడం అవుతుంది అనుకోవచ్చు కానీ పోనూ పోనూ దీని మీద ఏమైనా తెలిసే అవకాశం అయితే కచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం. ఎవరు ఏమి చేసినా లేట్ అవవచ్చు కానీ దాచినా దాగేది కాదు అన్నది నిజం. సో షర్మిల మీద వైసీపీ హాట్ కామెంట్స్ ఆమెకు ఇస్తున్న ప్రయారిటీ వెనక ఏముంది అన్నది కొద్ది రోజులు ఆగితే జవాబు బహుశా దొరకవచ్చేమో.