కుటిల ప్రచారానికి దీటైన జవాబు!

జగన్మోహనరెడ్డి 9 నెలల పాలన గురించి విపక్షాలకు ప్రధానంతా రెండు రకాల భయాలున్నాయి. Advertisement 1- అధికార వికేంద్రీకరణ తర్వాత… అమరావతి రాజధాని అనే ముసుగులో తాము చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి. 2-…

జగన్మోహనరెడ్డి 9 నెలల పాలన గురించి విపక్షాలకు ప్రధానంతా రెండు రకాల భయాలున్నాయి.

1- అధికార వికేంద్రీకరణ తర్వాత… అమరావతి రాజధాని అనే ముసుగులో తాము చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి.

2- ఇన్నేసి సంక్షేమ పథకాలతో జగన్ రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకుంటే గనుక.. ఇక ఎప్పటికీ.. ఆయనను ఓడించడం సాధ్యం కాదు.

ఈ రెండు కోణాల్లోనూ వారు తెగ ఆందోళన చెందుతున్నారు. ఒకటో విషయంలో వారిక చేయగలిగిందేమీ లేదు. అందుకే రెండో విషయంలో.. ప్రజలు ఆదరించే సంక్షేమ పథకాల గురించి.. అనుమానాల్ని భయాల్ని వ్యాపింపచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అమ్మఒడి పథకం  గురించి కూడా తెదేపా దళాలు ఇలాంటి దుష్ప్రచారాన్నే కొన్ని రోజులుగా సాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కిందిస్థాయి కార్యకర్తలు, చిన్న నాయకులు అజ్ఞానంతో మాట్లాడే మాటలు వేరు. పెద్ద నాయకులు మాట్లాడే మాటలు వేరు. అయితే ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా.. అమ్మఒడి పేరుతో జగన్ తల్లుల్ని మోసం చేశాడని, ఇద్దరు పిల్లలకూ ఈ పథకం వర్తిస్తామని చెప్పి.. ఇప్పుడు ఒక్కరికే సొమ్ములు  ఇస్తున్నారంటూ దెప్పిపొడిచారు.

ఇలాంటి కుటిల విమర్శలకు తాజాగా జగన్మోహన రెడ్డి దీటైన సమాధానం చెప్పారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే వారందరికీ కూడా అమ్మఒడి వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. ఇవాళ జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం సందర్భంగా విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. విపక్షాల కువిమర్శలను తిప్పికొట్టారు.

పేదల జీవితాలు బాగుపడడానికి విద్యపరంగా పరిపుష్టం చేయనున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది.. విద్య మాత్రమేనని జగన్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మొత్తంగా మార్చనున్నట్లు జగన్ ప్రకటించారు. బహుశా విద్యా మాఫియా మీద ఆధారపడి.. వారినుంచి దండుకుంటున్న కోట్ల రూపాయల సొమ్ములతో రాజకీయాలు నడిపే నాయకులకు జగన్మోహన రెడ్డిమాటలు కర్ణకఠోరంగా ఉంటాయేమో!

పిల్లాడి మాటలకు మురిసిపోయిన సిఎం వైయస్ జగన్