తమ్ముళ్ళ భాగోతం విప్పుతానంటున్న బీజేపీ నేత!

నిజంగా ఇది వింత వార్తే. ఎందుకంటే  దేశంలో ఎలా ఉన్నా కూడా ఏపీ వరకూ  చూస్తే మాత్రం టీడీపీ, బీజేపీ ఒకే మాట, ఒకే బాట అన్నట్లుగా ఉంటున్నాయి. రెండు పార్టీలు దాదాపుగా ఒకే…

నిజంగా ఇది వింత వార్తే. ఎందుకంటే  దేశంలో ఎలా ఉన్నా కూడా ఏపీ వరకూ  చూస్తే మాత్రం టీడీపీ, బీజేపీ ఒకే మాట, ఒకే బాట అన్నట్లుగా ఉంటున్నాయి. రెండు పార్టీలు దాదాపుగా ఒకే స్వరంతో అధికార వైసీపీని చెడుగుడు ఆడుకుంటున్నాయి.

ఇద్దరికీ రాజధానిగా అమరావతే కావాలి. ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టిన మేరకు కర్నూల్ లో హై కోర్టు ఒకటి కావాలని డిమాండ్ చేయాల్సిన కమలధారులు కూడా అన్నీ అమరావతిలోనీ  ఉండాలంటూ అచ్చం పసుపు పార్టీ మాదిరిగా నానా యాగీ చేస్తూండడం విధితమే.

మరి విశాఖలో మాత్రం ఒక బీజేపీ నేత కాస్త భిన్నంగానే కనిపిస్తున్నారు. ఆయన జగన్ సర్కార్ విషయంలో తప్పును తప్పుగా, మంచిని మంచిగా చెబుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను మెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు  జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం బోధనకు కూడా జై కొట్టారు.

ఇవన్నీ ఇలా ఉనటే విశాఖ జిల్లావ్యాప్తంగా గత టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున భూ దందా జరిగిందని నాడు నిండు సభలో బయటా ఆరోపించి విచారణకు డిమాండ్ చేసింది కూడా ఈ రాజుగారే. మొత్తానికి అప్పట్లో సిట్ ఏర్పాటు అయింది. దానికి కూడా కావాల్సినన్ని ఆధారాలతో ఆయన ఫిర్యాదులు ఇచ్చి వచ్చారు.

సరే ఆ నివేదిక ఏమైందో చంద్రబాబు సర్కారే చెప్పాలి. ఇపుడు చూస్తే మాత్రం వైసీపీ సర్కార్ మరో సిట్ వేసింది. ఈ సిట్ లో రిటైర్డ్  అధికారులతో పాటు, పోలీసు అధికారులే ఉన్నారు. దాంతో ఈ సిట్ కి తాను సహకరిస్తానని రాజుగారు ముందుకు రావడం గొప్ప విషయమే.

గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై ప్రభుత్వం కోరితే సిట్ తో కలసి పనిచేసేందుకు, తన వంతు సహకారం అందించేందుకు కూడా సిధ్ధమేనని రాజు గారు అంటున్నారు తాను రాజకీయాలకు అతీతంగా ఈ ప్రకటన చేస్తున్నానని ఆయన చెబుతున్నారు

పైగా గతంలో తాను పబ్లిక్ అకౌట్స్ కమిటి  మెంబర్ గా కూడా పనిచేయడం వల్ల కాగ్ నివేదికను కూడా బాగా అధ్యయనం చేశానని ఆయన చెప్పారు. టెండర్లు, లావాదేవీల విషయంలో సిట్ కి తాను సాంకేతికంగా సహకారం చేస్తామని తనంతట తానే రాజు గారు ముందుకు వచ్చారు. విశాఖ భూ కుంభకోణలో అసలు నిజాలు బయటకు వచ్చేదుకు పూర్తిగా సహకరిస్తానని అంటున్న రాజుగారు సేవలు ప్రభుత్వ పెద్దలు గుర్తించి తీసుకుంటే బెటరేమో.

ఏది ఎలాగున్నా సిట్ కు తాను సహకరించి తమ్ముళ్ళ భాగోతాలు బయటేస్తానని ఈ బీజేపీ పెద్దాయన చెప్పడంతో విశాఖ పసుపు నేతల్లో మరో కలవరం బయల్దేరింది.

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు