రెచ్చగొడుతున్నారా..? రెచ్చిపోతున్నారా…?

అమరావతి ఉద్యమానికి ఎక్కడా మద్దతు లభించడం లేదు. స్వయంగా చంద్రబాబే ఉద్యమానికి దూరంగా ఉంటున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో పెయిడ్ బ్యాచ్ తో కలసి ప్రతిపక్ష నేతలు వేసిన వలలో అధికార…

అమరావతి ఉద్యమానికి ఎక్కడా మద్దతు లభించడం లేదు. స్వయంగా చంద్రబాబే ఉద్యమానికి దూరంగా ఉంటున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో పెయిడ్ బ్యాచ్ తో కలసి ప్రతిపక్ష నేతలు వేసిన వలలో అధికార పార్టీ నేతలు చిక్కుకుంటున్నారా అనే అనుమానం రాకమానదు. అమరావతి ఆందోళనలు అనేవి పూర్తిగా స్తబ్దుగా మారిన వేళ.. ఇటీవల రోజాని అడ్డుకోవడం, తాజాగా నందిగం సురేష్ వాహనం రైతుని తగలడం వంటి అంశాలు మాత్రం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారాయి.

ఆమధ్య రాజధాని ప్రాంతంలో జరిగే ఓ సెమినార్ కి ఏపీఐఐసీ చైర్మన్ హోదాలో రోజా వెళ్లబోతుండగా అమరావతి రైతులు అడ్డుకున్నారు. గొడవలేవీ జరగలేదు కానీ, ఆ తర్వాత రోజా ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలే హైలెట్ అయ్యాయి. రాజధానిని కూడా ఇక్కడ ఉంచేలా లేరు అంటూ రోజా కాస్త నోరు జారడంతో.. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. కారులో కూర్చుని వీడియో తీశారంటూ మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇప్పుడు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కారు వ్యవహారంలో ఈనాడు ఒకలా, సాక్షి మరోలా స్పందించింది. ఎంపీ కారుపై దాడి జరిగిందని సాక్షి వార్తలిస్తుండగా.. రైతుని కారుతో ఢీకొట్టారంటూ ఈనాడు, ఏబీఎన్ మరో వీడియోని పట్టుకుని రెచ్చిపోతున్నాయి. ఈ రెండు సంఘటనలతో మరోసారి అమరావతి ఆందోళనల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చింది.

ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి సరే.. అధికార పార్టీ నేతలు ఆ ఉచ్చులో పడిపోయి రెచ్చిపోవడం ఎంతవరకు సమంజసం. పడుకున్న గాడిదను లేపి మరీ తన్నిచ్చుకోవడం అంటే ఇదే. అమరావతి ఆందోళనలు అనే అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టేసి, దానిపై స్పందించకుండా.. సీఎం జగన్ తెలివిగా వ్యవహరిస్తూ వచ్చారు. తద్వారా అక్కడ జరిగే ప్రతిపక్షాల కుట్రపూరిత నాటకాలపై రాష్ట్ర ప్రజల ఫోకస్ పడకుండా చేయగలిగారు. కానీ క్యాడర్ ఈ పని చేయడం లేదు.

ఇప్పుడు పనిగట్టుకుని వైసీపీ నేతలు అమరావతి ఆందోళనలను కదిలించడం ఎందుకు. అక్కడుంది పెయిడ్ బ్యాచ్ అని తెలుసు, రెచ్చగొట్టేందుకు వారు ఎంతకైనా దిగజారతారని కూడా తెలుసు. అలాంటి సందర్భాల్లో సంయమనం పాటించగలిగితే మంచిది, లేదా స్పందించకుండా ఉండగలిగితే మరీ మంచిది. లేదంటే వైసీపీ నేతలే ఈ నకిలీ ఉద్యమాన్ని మరింత పెంచిపోషించినవారు అవుతారు.

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు