Advertisement

Advertisement


Home > Politics - Gossip

అలీ పంట పండేరోజు.. అతి దగ్గర్లో..!

అలీ పంట పండేరోజు.. అతి దగ్గర్లో..!

ఎన్నికలకు ముందు చాలా హంగామా చేశారు. మంత్రిపదవి ఇస్తానని రాసిచ్చిన పార్టీలోనే చేరుతానని బహిరంగంగా ప్రకటించారు. తనకు నచ్చిన నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మారాం చేశారు. కట్ చేస్తే.. ఎలాంటి కండిషన్స్ లేకుండా వైసీపీలో చేరారు అలీ. అలా ఎన్నికల్లో పోటీకి పూర్తిగా దూరమై, కేవలం ప్రచారానికే పరిమితమైన అలీకి ఇప్పుడు మంచిరోజులు దగ్గరపడ్డాయి. ఈ సీనియర్ నటుడి పంట పండే రోజు దగ్గర్లోనే ఉంది.

అలీపై ఆది నుంచి సాఫ్ట్ కార్నర్ తో ఉన్న జగన్.. పార్టీలో అలీకి తగు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అతడికి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ పదవి దక్కితే, రెండోదఫా మంత్రివర్గ విస్తరణ ప్రాబబుల్స్ లో అలీకి కూడా చోటు దక్కినట్టయింది. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడున్న మంత్రుల్లో కొందర్ని తొలిగింది, కొత్తగా మరికొందరికి అవకాశం ఇస్తారు జగన్. అలీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే, రెండోవిడత మంత్రివర్గ విస్తరణ ఆశావహుల్లో ఆయన కూడా ఉన్నట్టే.

ఒకవేళ మలిదశ విస్తరణలో అలీకి ప్రధాన్యం దక్కకపోతే.. ఈలోగానే ఆయనకు మంచి నామినేటెడ్ పదవిని జగన్ కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే రోజాకు అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చారు ముఖ్యమంత్రి. కాబట్టి అలీకి కూడా మంత్రిపదవి కాకుండా, ఇలాంటి కీలకమైన నామినేటెడ్ పదవి ఏదైనా ఇవ్వొచ్చనే ప్రచారం కూడా మరోవైపు నడుస్తోంది.

ఈ సంగతి అలా ఉంచితే.. లిస్ట్ లో మరికొంత మంది సినీప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్లే మోహన్ బాబు, జయసుధ, రాజశేఖర్ దంపతులు. వీళ్లకంటే ముందే అలీకి ఛాన్స్ ఇస్తే.. వీళ్లలో అసంతృప్తి రేగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వాళ్లను ఓవైపు బుజ్జగిస్తూనే, మరోవైపు అలీని పైకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరోవైపు విశ్లేషకులు మాత్రం జగన్ దృష్టిలో ఇది చాలా చిన్న విషయం అంటున్నారు. రోజా లాంటి నేతనే మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కనపెట్టిన అధినేతకు.. అలీ విషయంలో ఎదురయ్యే అసంతృప్తిని చల్లార్చడం పెద్దకష్టం కాదంటున్నారు. అదీ నిజమే. 

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?