జగన్ అంత పని చేస్తున్నారా.. ఉలిక్కిపడ్డ నేతలు

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల పర్వం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఉన్నత స్థాయి అధికారుల బదిలీలు జరిగిన తర్వాత పోలీస్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లలో ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ పూర్తవుతోంది. దాదాపు అన్ని…

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల పర్వం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఉన్నత స్థాయి అధికారుల బదిలీలు జరిగిన తర్వాత పోలీస్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లలో ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ పూర్తవుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో పారదర్శకంగా ఈ బదిలీలు నిర్వహించామని కలెక్టర్లు, ఎస్పీలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు కూడా. కానీ వాస్తవంలోకి వస్తే మాత్రం ఎమ్మెల్యేల సిఫార్సులు బలంగా పనిచేశాయి.

ఉన్నతాధికారులు కూడా సిఫార్సు లేఖలను ఎక్కడా వ్యతిరేకించలేదు. ఇంకా చెప్పాలంటే సిఫార్సులతో పని అవుతుందని తెలుసుకున్న చాలామంది చివరి నిముషంలో కూడా ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి పనులు పూర్తి చేయించుకుంటున్నారు. ఒకటా రెండా ఒక్కో ఎమ్మెల్యే వందల లెటర్లు ఇలా కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీస్ లకు పంపించిన ఉదాహరణలున్నాయి.

ఓవైపు వైఎస్ జగన్ ఎక్కడా పాలనా పరమైన విధానాల్లో జోక్యం చేసుకోవద్దని, రికమండేషన్లు చేయొద్దని, అక్రమాలకు పాల్పడొద్దని ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటినీ సీఎం జగన్ ఓ కంట కనిపెడుతున్నారని సమాచారం.

ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎంతమందికి సిఫార్సు లేఖలు ఇచ్చారు, ఎవరెవర్ని అధికారుల వద్దకు పంపించారు అనే విషయాలపై జగన్ దగ్గర ఓ లిస్ట్ ఉందట. నేరుగా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల నుంచి ఇలాంటి రికమండేషన్ లెటర్ల సాఫ్ట్ కాపీస్ అన్నీ జగన్ కార్యాలయానికి చేరుతున్నాయట. అసెంబ్లీ సమావేశాల తర్వాత వీటిపై ఎమ్మెల్యేలతో ఓ సమీక్ష నిర్వహించడానికి జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఎలాంటి పరిస్థితుల్లో ఇలా లేఖలు ఇవ్వాల్సి వచ్చిందనే విషయంపై సదరు ఎమ్మెల్యేల నుంచి సంజాయిషీ కోరబోతున్నారు జగన్. అదే జరిగితే ఎమ్మెల్యేలలో జవాబుదారీతనం పెరుగుతుందనడంలో సందేహం లేదు. పోనీ తమకు తెలియకుండా జరిగాయని ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పించుకోవాలని చూసినా, రెండోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది.

మొత్తమ్మీద జగన్ మాత్రం ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతున్నారనేది మాత్రం వాస్తవం. వారి పనితీరుతో పాటు, చేతివాటంపై కూడా ముఖ్యమంత్రి నిఘా పెట్టారు.

డియర్ కామ్రేడ్ నా మూడేళ్ళ కష్టం.. భరత్ స్పెషల్ చిట్ చాట్

‘అర్జున్ రెడ్డి’ లెగసీ ఇంకా.. ఇంకా..!