Advertisement

Advertisement


Home > Politics - Gossip

సంకల్పానికి కట్టుబడడం అంటే ఇదే!

సంకల్పానికి కట్టుబడడం అంటే ఇదే!

జగన్మోహన రెడ్డి ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం తీసుకువస్తానంటూ అక్కచెల్లెళ్లకు ఎన్నికలకు ముందుగానే మాట ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన  నాటినుంచి ఇప్పటిదాకా.. తన చిత్తశుద్ధిని పలు నిర్ణయాల ద్వారా నిరూపించుకుంటూనే ఉన్నాడు. ధరలు పెరిగాయి. దుకాణాలు తగ్గాయి. మద్యం వినియోగం కూడా తగ్గింది.

అదే సమయంలో.. రాబోయే స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రలోభాలు ఉండకూదని కూడా జగన్ సంకల్పించాడు. అలాంటి ప్రలోభాలకు పాల్పడిన వారికి జైలుశిక్షలు విధించేలా చట్టం తెచ్చాడు. ఆ సంకల్పం ఒక్కటే కాదు.. ఆ సంకల్పాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడానికి మరో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, పురపాలికలు, పంచాయతీల ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా సంపూర్ణ మద్య నిషేధం విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల పాటు మద్యం సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయ్యే 12వ తేదీనుంచి.. 29వ తేదీ వరకు మద్యనిషేధం పూర్తిగా అమల్లో ఉంటుంది.

జగన్ సర్కారు స్వచ్ఛమైన రాజకీయాలను సృజించడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతకాలం ఇలా డబ్బు పంచుతూ, లిక్కర్ పంచుతూ ఓట్లు కొనుక్కోవడం.. ఎక్కడో ఒకచోట వీటిని ప్రక్షాళన చేయడం మొదలెట్టాలి.. ఈ ఎన్నికలతోనే అది మొదలు కావాలి.. అని జగన్ గతంలో విస్పష్టంగా ప్రకటించారు.

అందుకే ఈ ఎన్నికల్లో మద్యం పంచడం, డబ్బు పంచడం నేరంగా కఠిన శిక్షలు విధిస్తూ జీవో తెచ్చారు. ఏ పార్టీ వారైనా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రకటించారు.  చట్టాన్ని ఎంత గట్టిగా తయారుచేశారంటే.. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడ్డాక గెలిచిన తర్వాత కూడా వారు ప్రలోభాలకు పాల్పడినట్లు తేలితే పదవి పోవడంతో పాటు శిక్ష తప్పదని కూడా తేల్చారు.

ఈ సంకల్పం చాలా గొప్పది. అయితే ఈ సంకల్పం ఆచరణలోకి వచ్చేసరికి ఎలా నీరుగారిపోతుందో అనే అభిప్రాయం పలువురికి ఉంది. ఆ అనుమానాలను కూడా పటాపంచలు చేస్తూ జగన్ సర్కారు మరో అద్భుత నిర్ణయం తీసుకుంది.

12వ తేదీనుంచి పంచాయతీల రెండో విడత పోలింగ్ పూర్తయ్యే దాకా రాష్ట్రంలో అసలు మద్యం అమ్మకాలనే పూర్తిగా బంద్ చేశారు. ఓటర్లకు తాగించి గెలవాలనుకునే వారికి ఈ నిర్ణయం పెద్ద దెబ్బే. కానీ.. స్వచ్ఛ రాజకీయాలు కోరుకునే వారందరూ కూడా జగన్ ను అభినందించి తీరాల్సిందే.

ఒక ప్రిన్సిపల్ కడుపులో గుండాగాడు పుట్టాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?