న్యాయమూర్తుల కామెంట్లు..మీడియా ప్రొజెక్షెన్

ఈరోజు తెల్లవారుతూనే ఎప్పటి మాదిరిగానే తెలుగుదేశం అనుకూల మీడియాలో యాంటీ గవర్నమెంట్ వార్తలు కొలువుతీరాయి. అది మామూలే. ఆ పత్రికలు కొనేవారికీ తెలుసు. చదివే వారికీ తెలుసు. చదవనివారికి అంతకన్నా బాగా తెలుసు. అలాంటి…

ఈరోజు తెల్లవారుతూనే ఎప్పటి మాదిరిగానే తెలుగుదేశం అనుకూల మీడియాలో యాంటీ గవర్నమెంట్ వార్తలు కొలువుతీరాయి. అది మామూలే. ఆ పత్రికలు కొనేవారికీ తెలుసు. చదివే వారికీ తెలుసు. చదవనివారికి అంతకన్నా బాగా తెలుసు. అలాంటి వార్తల్లో రాజధాని తరలింపు అన్నది 'మతిమాలిన చర్య కాక మరేమిటి? అని కోర్టు వ్యాఖ్యానించింది' అంటూ వార్త.

ఒక్క క్షణం అనుమానం. రాజధాని తరలింపు కేసు కోర్టు పరిథిలో వుంది కదా. అది ఓ కొలిక్కి వచ్చేసి వుంటుంది. కోర్టు ఇలా కామెంట్ చేసింది అంటే రాజధాని కేసులో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలి వుంటుది అన్న సవాలక్ష అనుమానాలు ఒకేసారి. సామాన్యులు ఎవరు ఆ వార్త చదవినా అదే అనుమానం.

కానీ మొత్తం వార్త చదివితే తప్ప క్లారిటీ రాదు. అసలు ఏం జరిగిందీ అర్థం కాదు. విషయం ఏమిటంటే కోర్టులో విచారణ జరుగుతున్న కేసు వేరు.

ఆ కేసులో అలా అలా సంభాషణ అలా రాజధాని వైపు మళ్లింది. ఓ కేసులో ప్రభుత్వానిది మతిమాలిన చర్య అని పిటిషనర్ పేర్కోన్నారు. దానికి ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. ఇలాంటి పదజాలం వాడడం సరికాదు అన్నది ప్రభుత్వ న్యాయవాది వాదన.

అదిగో అక్కడ న్యాయమూర్లులు కలుగ చేసుకుని మాట్లాడినపుడు''… ‘మూడు వేల కోట్ల వ్యయంతో చేపట్టిన రాజధాని నిర్మాణ పనుల్ని అర్థంతరంగా నిలిపివేయడం మతిలేని చర్య కాదా?’’ అని నిలదీసారట. రాజధాని అంశాన్ని ప్రస్తావించడంపై ప్రభుత్వం తరపు న్యాయవాది ఎన్‌ఎస్‌ ప్రసాద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘రాజధానుల పిటిషన్లను విచారించే ధర్మాసనంలో మీరు లేరు. నేను న్యాయవాదిగా లేను. అది ఇక్కడ అప్రస్తుతం. రాజధాని విషయం పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన అంశం. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. న్యాయస్థానాలు కూడా విచారణ పరిధిని, తమ పాత్రలను విస్మరిస్తున్నాయి’’ అని ఆయన అన్నారట. 

దానికి మళ్లీ న్యాయమూర్తులు బదులిస్తూ…''అంటే మీ ప్రభుత్వం మాత్రం ఈ సమాజాభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం కోసమే అన్నీ చేసేస్తోందా? ఇలాంటివి మా వద్ద చెప్పకండి’’ అని వ్యాఖ్యానించారట. పైగా ఇది తమ వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారట. 

ఇదీ ఆ వార్తలు చదివితే అర్థం అయిన విషయం. ఇప్పుడు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, న్యాయమూర్తులు వేరే కేసు సందర్భంగా, తమ వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొంటూ చెప్పిన విషయాలను, హైకోర్టు అభిప్రాయం అని అర్థం వచ్చేలా ప్రొజెక్ట్ చేస్తూ వార్తలు రాయొచ్చా?  ఆ విధంగా రాజధాని వికేంద్రీకరణకు హైకోర్డు వ్యతిరేకం అనే అభిప్రాయాన్ని ముందుగానే ( సంబంధిత కేసు విచారణలో వుంది) జనంలో కలుగచేసే ప్రయత్నం కింద పరిగణించవచ్చా? 

ధర్మాసనం మీద కూర్చున్నపుడు ఓ విషయం కీలకమైన కేసుగా వేరే ధర్మాసనంలో విచారణకు వున్నపుడు ఇక్కడ న్యాయమూర్తలు ఆ కేసును ప్రభావం చేసే మాదిరిగానో లేదా, జనాలు ప్రభావితం అయ్యేమాదిరిగానో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవచ్చో, చేయకూడదో సామాన్యులమైన మనకు తెలియదు.

అది న్యాయసూత్రాలకు సంబంధింధించిన విషయం. కానీ ఆ విషయాన్ని ఈ విధంగా మీడియా ప్రొజెక్టు చేయవచ్చా? కూడదా? అన్నది కూడా అనుమానమే.

నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండుకే కిస్ పెట్టాను