Advertisement

Advertisement


Home > Politics - Gossip

కమ్మనేతలు కూడా కమలం బాటలో!

కమ్మనేతలు కూడా కమలం బాటలో!

తెలుగుదేశం పార్టీ పట్ల వీరవిధేయంగా ఉండే కమ్మ సామాజికవర్గంలో కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై అపారమైన ప్రేమ పుట్టుకురావడం విశేషం. పార్టీ అధికారం కోల్పోవడంతో వీరికి తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద ప్రేమ తగ్గిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు బీజేపీ మీద వీరికి అభిమానం పొంగుకు వస్తోంది. కులాభిమానంతో మొన్నటివరకూ పొంగిపోయిన వీళ్లు, ఇప్పుడు జాతీయ వాదంతో పొంగిపోతున్నారట. అంతా అధికారం మహిమ!

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరడంలో కమ్మ సామాజికవర్గానికి ఆరాధ్యనీమయైన స్థాయిలో ఉన్నవారు కూడా ఉండటం గమనార్హం. ఈ జాబితాలో పరిటాల కుటుంబం పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన ఈ రాజకీయ కుటుంబాన్ని ఎక్కడెక్కడి కమ్మవాళ్లు కూడా ఒక రేంజ్లో ఆరాధిస్తూ ఉంటారు. వీళ్లను తమ సామాజికవర్గానికే చక్రవర్తులు అనిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లలో స్ఫూర్తి నింపడంలో వీరు ముందు వరసలో ఉంటారు!

కేవలం తమ నియోజకవర్గం వరకూ మాత్రమే కాకుండా, తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆరాధ్యనీయులుగా ఇతర నియోజకవర్గాల్లోనూ, జిల్లాల్లో కూడా వీళ్లు నేతలుగా చలామణి అయిపోతూ ఉన్నారు. మరి అలాంటి స్థితిలో ఉన్నా వీళ్లు మాత్రం తమ రాజకీయం కోసం వలస వెళ్లబోతున్నారనే వార్తలు వస్తుండటం గమనార్హం. తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీని చేరబోయే వారి జాబితాలో పరిటాల కుటుంబం కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

కమలం పార్టీలోకి వీరు చేరబోతూ ఉన్నారట. అలా చేరి వీళ్లు రాజకీయంగా సాధించేది ఏమీలేకపోయినా, కేసులు, ఇతర ఇబ్బందులు లేకుండా ఉండిపోవడానికి మాత్రం కమలం పార్టీని వీరు కూడా సేఫ్‌జోన్‌గా భావిస్తున్నారని టాక్‌ నడుస్తూ ఉంది. అయితే ఈ ప్రచారం విషయంలో పరిటాల కుటుంబం ఇంకా స్పందించలేదు. మరోవైపు అనంతపురం జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీ బాటలో ఉన్నాడట.

భారీ ఎత్తున కాంట్రాక్టు పనులు చేశారాయన. ఇప్పుడు బిల్లులు పొందడం కోసం ఆయన బీజేపీలోకి చేరబోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇలా బీజేపీలోకి చేరడం విషయంలో కమ్మ సామాజికవర్గం నేతలే ముందుడటం గమనార్హం అని పరిశీలకులు అంటున్నారు.

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?