లోకేష్ కోసమేనా ఈ కేబినెట్ మీటింగ్!

ఎవరు ఔనన్నా, కాదన్నా కేబినెట్ మీటింగ్ పెట్టి తీరతామని ప్రకటించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు. కేవలం పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని ఆమోదింపజేసుకొని, అస్మదీయులకు కోట్ల రూపాయలకు కట్టబెట్టడం కోసమే చంద్రబాబు ఈ కేబినెట్…

ఎవరు ఔనన్నా, కాదన్నా కేబినెట్ మీటింగ్ పెట్టి తీరతామని ప్రకటించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు. కేవలం పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని ఆమోదింపజేసుకొని, అస్మదీయులకు కోట్ల రూపాయలకు కట్టబెట్టడం కోసమే చంద్రబాబు ఈ కేబినెట్ భేటీ డ్రామా ఆడుతున్నారనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పసిగట్టారు. ఇప్పుడిందులో కొత్త కోణం బయటపడింది. అవును.. కేవలం లోకేష్ కోసమే ఈ మంత్రివర్గ సమావేశం పెడుతున్నారట.

రాష్ట్రంలో ఉపాధిహామీ పనులన్నింటినీ తమ వర్గానికి చెందిన నేతలు, వ్యక్తులకే చంద్రబాబు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఉపాధిహామీ పనులు ఏ స్థాయిలో జరిగాయనే విషయాన్ని పక్కనపెడితే, ఓ వర్గం మాత్రం “ఉపాధి” పేరిట బాగా లాభపడింది. ఈ పథకం కింద కోట్లకు పడగలెత్తిన వ్యక్తులున్నారు. ఇప్పుడు వాళ్లకు మరింత మేలు చేకూర్చేందుకే ఈ మీటింగ్ పెడుతున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పెండింగ్ బిల్లులన్నీ లోకేష్ మంత్రిత్వశాఖ కిందే ఎక్కువగా ఉన్నాయట.

తాజా సమాచారం ప్రకారం, ఉపాధిహామీ పథకం కింద చెబుతున్న పెండింగ్ బిల్లుల్లో దాదాపు 80శాతం బిల్లులు పంచాయతీ రాజ్ శాఖలోనే ఉన్నాయట. ఈ బిల్లుల విలువ దాదాపు 14వందల కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. వీటిని ఎలాగైనా క్లియర్ చేయాలని లోకేష్ పై ఒత్తిడి పెరుగుతోందట. ఈ నిధుల్ని కొల్లగొట్టేందుకే కేబినెట్ మీటింగ్ డ్రామాను తెరపైకి తీసుకొచ్చారు చంద్రబాబు. మీటింగ్ లో మమ అనిపించేసి 1400 కోట్ల రూపాయల్ని రిలీజ్ చేయాలనేది చంద్రబాబు ఎత్తుగట.

చంద్రబాబు కేబినెట్ భేటీపై ఈసీ కూడా ఓ కన్నేసి ఉంచింది. శాఖల వారీగా ఏఏ అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారో సవివరంగా నోట్ సమర్పించాల్సిందిగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆదేశించింది. ఈరోజు మధ్యాహ్నం వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమౌతారు సీఎస్. కోడ్ అమల్లో ఉన్న ఈ టైమ్ లో ఇంత అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయంతో పాటు.. ఎజెండాలో అంశాలపై సీఎస్ చర్చిస్తారు. కేవలం బిల్లుల క్లియరెన్స్ కోసమైతే కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వకపోవచ్చు.

మొత్తమ్మీద తనయుడు లోకేష్ కోసం చంద్రబాబు భారీ స్కెచ్ వేశారు. తన కొడుకు శాఖకు చెందిన బిల్లుల చెల్లింపుల కోసం ఈసీతో ప్రభుత్వం ధర్మయుద్ధం చేస్తోందంటూ కలరింగ్ ఇస్తున్నారు. ఇదీ అసలు సంగతి.

వర్మపై అంత దాష్టికం అవసరమా బాబు