సోషల్ మీడియా అనేది వర్తమాన ప్రపంచాన్ని ఒక ఊపుఊపేస్తున్న మాధ్యమం. సెలబ్రిటీ లందరూ సోషల్ మీడియా అకౌంట్లతో తమ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటారు. నిజానికి వారిలో చాలా మందికి సొంతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంత టెక్నికల్ నాలెడ్జిగానీ, ఓపిక తీరిక గానీ ఉండవు. అయినా సరే.. సోషల్ మీడియా అకౌంట్లను మాత్రం మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా ఈ వేదికల మీదికి మెగాస్టార్ చిరంజీవి కూడా అడుగు పెడుతున్నారు.
నేను కూడా సోషల్ మీడియాలోకి రాబోతున్నాను. ఎందుకంటే.. ఈ సోషల్ మీడియా ద్వారా నా అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవచ్చునని.. ఏదైనా సందేశం చెప్పదలచుకున్నప్పుడు… అందరికీ చెప్పవచ్చునని నా భావాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకోవచ్చునని మెగాస్టార్ భావిస్తున్నారట. అందువల్లనే ఈ ఉగాది నాటినుంచి.. తాను సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నట్లుగా తెలియజేస్తూ ఆయన ప్రత్యేకంగా ఒక వీడియోను విడుదల చేశారు.
మెగాస్టార్ ఫ్యామిలీలో అందరికంటె ఎక్కువ క్రేజ్ ఉన్నది మెగాస్టార్ చిరంజీవికే. ఫ్యామిలీలో అందరూ కూడా.. మెగాబంధంతో ఎంట్రీ ఇచ్చి నెమ్మదిగా సెలబ్రిటీలుగా ఎదిగిన వాళ్లు మాత్రమే. అలాంటి వాళ్లలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విటర్లో చాలా యాక్టివ్ గా ఉంటుంటారు. ఎటూ పాలిటిక్స్ లో కూడా ఉంటూ… ఆయన రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నాడు గనుక… పవన్ ఎడాపెడా ట్వీట్లు పెట్టేస్తూ తెలుగు ప్రజల్ని రంజింపజేస్తుంటుడు.
అదే సమయంలో మరో మెగా సోదరుడు నాగేంద్రబాబు.. సోషల్ మీడియాను బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. టీవీల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాల కంటె దండిగా డబ్బు సంపాదించడం అలవాటు చేసుకున్న నాగేంద్రబాబుకు.. సోషల్ మీడియా కూడా అంతే మోతాదులో సొమ్ములు అందిస్తోంది. ప్రధానంగా యూట్యూబ్ వీడియోలతో ఆయన తరచూ అభిమానుల్ని, ద్వేషించే వారిని కూడా పలకరిస్తూ.. ఒక స్థాయిలో క్రేజ్ మూటగట్టుకున్నారు.
తమ్ముళ్లిద్దరినీ చూసి తాను వెనుకబడిపోతున్నట్టుగా చిరంజీవికి అనుమానం వచ్చిందో ఏమో గానీ.. మొత్తానికి లేటుగా అయిన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఏయే సోషల్ ప్లాట్ ఫారంల మీదినుంచి ఆయన ఏయే భావాల్ని అభిమానులతో పంచుకుంటారో.. ఏయే సందేశాలను ప్రజలకు అందిస్తారో.. ఏమేరకు క్రేజ్ పుటప్ చేస్తారో చూడాలి.