Advertisement

Advertisement


Home > Politics - Gossip

మోడీకి, కేడర్ కు ఇష్టం లేని పొత్తు

మోడీకి, కేడర్ కు ఇష్టం లేని పొత్తు

చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా ను కలిసి వచ్చారు. ఎన్ డి ఎ నుంచి ఆహ్వానం అందింది అనే వార్తలు వచ్చాయి. మనకు వేరే దారి లేదు, రాష్ట్రం కోసం మనం ఎన్ డి ఎ తోనే వెళ్లాలని పార్టీ కీలక నేతలకు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తరువాత పవన్ కూడా ఢిల్లీ వెళ్తున్నారని కూడా ప్రచురించారు. ఢిల్లీ వెళ్లలేదు కానీ పవన్ వచ్చి బాబును కలిసి మంతనాలు జరిపారు. అంతే అక్కడితో సరి. ఆ తరువాత ఏమయిందో తెలియదు. కొత్త అప్ డేట్ లేదు.

ఇదిలా వుంటే తెలుగుదేశం కేడర్ కానీ, పార్టీని అభిమానించే హార్డ్ కోర్ జనాలకు కానీ భాజపాతో వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. కావాలంటే లోపాయకారీ పొత్తు పెట్టుకోవాలి తప్ప, బహిరంగ పొత్తు పనికిరాదని నిర్మొహమాటంగా సోషల్ మీడియా సాక్షిగా చెప్పేసాయి.

ఇక్కడ మెచ్చుకోవాల్సిన అంశం ఏమిటంటే జనసేనలో మాదిరిగా పొత్తును వ్యతిరేకిస్తే కోవర్డ్ లే. అలా చేస్తే పార్టీ నుంచి బయటకు తోసేస్తాం అని తెలుగుదేశం అధినాయకత్వం అనలేదు.

ఇలాంటి నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ప్రధాని మోడీకి తెలుగుదేశంతో పొత్తు ఇష్టం లేదని తెలుస్తోంది. అమిత్ షా తో బాబు సమావేశం సందర్భంగా కూడా గతంలో చంద్రబాబు భాజపా పట్ల ఏ విధంగా వ్యవహరించారు అనేది ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడు బాబు మౌనం వహించారు తప్ప మాట్లాడలేదని తెలుస్తోంది. మోడీ ముందు విషయం పెట్టి, ఆ తరువాత ఏ నిర్ణయమూ తెలియచేస్తామని అమిత్ షా చెప్పి, పంపినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం 90 శాతం వరకు భాజపా-తేదేపా బంధం కుదరడం మాత్రం కష్టమని తెలుస్తోంది. కుదరడానికి ఓ 10శాతం మాత్రం అవకాశం వుందని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?