నాగబాబు చీటీ చిరుగుతోందా?

అనకాపల్లి రాజకీయం రాజుకుంటోంది. అది కాస్తా నాగబాబు సీటుకు ఎసరు తెస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే రెండూ జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం వర్గాల్లో ప్రారంభమైన అసంతృప్తి చల్లారడం లేదు. జనసేనకు సహకరించే సమస్యే…

అనకాపల్లి రాజకీయం రాజుకుంటోంది. అది కాస్తా నాగబాబు సీటుకు ఎసరు తెస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే రెండూ జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం వర్గాల్లో ప్రారంభమైన అసంతృప్తి చల్లారడం లేదు. జనసేనకు సహకరించే సమస్యే లేదని తెలుగుదేశం కేడర్ భీష్మించుకు కూర్చుంది.

ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చాలంటే జనసేన ఇద్దరు అభ్యర్తుల్లో ఒకరిని మార్చాల్సిందే. ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాలను మారిస్తే పవన్ మీద నమ్మకం పోతుంది. ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించి, పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. తన సోదరుడి గెలుపుకోసమే ఇదంతా అన్నది అప్పుడే అర్థమయింది. ఇప్పుడు వెనక్కు తగ్గి నాగబాబును వుంచి కొణతాలను మారిస్తే నాగబాబు గెలుపు అనుమానం అవుతుంది.

అందువల్ల కొణతాలను త్యాగం చేయమని చెప్పే కన్న, నాగబాబునే అక్కడి నుంచి తప్పించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగబాబు పేరు అధికారికంగా ప్రకటించలేదు కనుక తప్పించినా తప్పు కింద రాదు. తగ్గడం అనిపించుకోదు. అయితే జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎంపీ టికెట్‌ను కాపులకే ఇవ్వాల్సి వుంటుంది. ఎందుకంటే కొణతాల గవర సామాజిక వర్గం కనుక. అక్కడ వైకాపా కాపులకు ఇచ్చింది కనుక.

కానీ ఇక్కడ ఇప్పటికే జనసేన/దేశం రాజకీయాలను స్పాన్సర్ చేస్తూ ఖర్చు చేస్తున్నవారిలో కాపు వర్గానికి చెందినవారు లేదు. వేరే వాళ్లని తేవాలి. అప్పుడు ఇప్పటి వరకు ఖర్చు చేసిన వారు అలుగుతారు. అదో సమస్య.

నాగబాబును ఎంపీ బరి నుంచి తప్పిస్తే మరెక్కడా ఖాళీ లేదు. అప్పుడు ఎమ్మెల్యే బరిలోకి దింపాలి. పవన్, నాదెండ్ల, నాగబాబు అంతా ఎమ్మెల్యే బరిలోకే అంటే అంత బాగోదు. అది ఇంకో సమస్య.

మొత్తం మీద చూస్తుంటే ఆ వంక చెప్పి, ఈ వంక చెప్పి నాగబాబును త్యాగం చేయమనేలా వుంది వ్యవహారం.