వర్మకు నాగబాబుకు ముడి?

వర్మకు పోస్ట్ ఇవ్వడం అంటే పవన్ ను నొప్పించడమే అని తెలుగుదేశం అధిష్టానం భావస్తోందనే మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

నాగబాబు మంత్రి ఎప్పుడు అవుతారు… అంతకన్నా ముందు ఎమ్మెల్సీ ఎప్పుడు అవుతారు. ఇదో భేతాళ ప్రశ్న. చంద్రబాబు చాణక్యం అలాంటిది. అసలు ఫలానా నాయకుడికి మంత్రి పదవి ఇస్తున్నాం అంటూ పార్టీ తరపున ప్రెస్ నోట్ ఇవ్వడం తెలుగుదేశం చరిత్రలోనే తొలిసారి. అలా ప్రకటించారు జనసేన నేత పవన్ సోదరుడు నాగబాబు పేరు. అలా ప్రకటించడానికి కొద్దిరోజుల ముందు ఎంపీ ఎన్నికలు వచ్చాయి. తిరుపతి దేవస్థానం పాలక వర్గం వచ్చింది. ఈ ప్రకటన, ఆ పదవుల భర్తీ అయిన తరువాత మరి సందడి లేదు. మంచి ముహుర్తం కోసం చూస్తున్నారేమో అనుకున్నారంతా. ముహుర్తాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ పదవీ స్వీకారం జాడ కనిపించడం లేదు.

ఇదిలా వుంటే పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మకు ఏదో ఒకటి తొలి విడతలోనే ఇవ్వాల్సి వుంది. ఎమ్మెల్సీ ఇస్తారేమో అనుకున్నారు కానీ అలా జరగలేదు. లేటెస్టుగా కష్టపడి సాధించే విజయమే గొప్ప అనేట్లు వర్మ ట్వీట్ వేసారు. అంటే ఎమ్మెల్సీ కన్నా ఎమ్మెల్యేనే ఇష్టం అనే అర్థం. కానీ పిఠాపురం ఎమ్మెల్యే అని అనిపించుకునే యోగం వర్మకు ఇక లేనట్లే అనుకోవాలి. ఎందుకంటే పిఠాపురం సీటును గెలవడం మాత్రమే కాదు, స్వంతం చేసేసుకున్నారు పవన్ కళ్యాణ్. కూటమిలో విబేధాలు వస్తే తప్ప పిఠాపురం నుంచి వర్మ పోటీ చేసే అవకాశాలు లేవు.

ఇదిలావుంటే వర్మకు పోస్ట్ ఇవ్వడం అంటే పవన్ ను నొప్పించడమే అని తెలుగుదేశం అధిష్టానం భావస్తోందనే మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పిఠాపురంలో ప్రస్తుతం ఒకటే పవర్ సెంటర్. అది పవన్. ఇప్పుడు వర్మకు కనుక ఏదైనా ఇస్తే మరో పవర్ సెంటర్ అవుతుంది కచ్చితంగా. పైగా పవన్ పిఠాపురంలో వుండరు. ఇప్పటికి టోటల్ గా జస్ట్ ఎనిమిది రోజులు మాత్రమే వున్నారనే లెక్కలు కూడా వున్నాయి. పవన్ లోకల్ గా వుండకుండా, ఏదో ఓ పదవి అండగా వర్మ చురుకుగా దూసుకుపోతే పవన్ భరించడం కష్టం.

అలా అని వర్మకు ఇవ్వకుండా నాగబాబుకు ఇస్తే పార్టీలో అసంతృప్తిని పెంచినట్లు అవుతుంది. అందువల్ల ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో మీరే చెప్పండి అని పవన్ కోర్టులో చంద్రబాబు బాల్ తోసినట్లు తెలుస్తోంది. ఇవి తెలిసే, తనకు ఏ ఎమెల్సీ వద్దు.. కష్టపడి గెలుచుకుంటా అని ఇండైరెక్ట్ గా వర్మ చిన్న హెచ్చరిక చేసినట్లు కనిపిస్తోంది.

ఈ చిక్కుముడిని చంద్రబాబు తన చాణక్యంతో ఎలా విప్పుతారో చూడాలి.

11 Replies to “వర్మకు నాగబాబుకు ముడి?”

Comments are closed.