మజాకా సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాన్ని బయటపెట్టాడు హీరో సందీప్ కిషన్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మీద ఓ డైలాగ్ పెట్టారు. అయితే ఆ డైలాగ్ ను సెన్సార్ అధికారులు కట్ చేశారంట. ఆ మేటర్ ఏంటో చూద్దాం..
మజాకా సినిమాలో ఖుషి మూవీ రిఫరెన్స్ ఉంది. ఆ సినిమాలో భూమిక నడుమును చూసీచూడనట్టు చూస్తుంటాడు పవన్ కల్యాణ్. సినిమాకు ఆ సీన్ హైలెట్, పైగా కీలకం కూడా.
అదే సీన్ ను మజాకాలో రీ-క్రియేట్ చేశారు. పవన్ కల్యాణ్ స్థానంలో రావు రమేష్ ను, భూమిక స్థానంలో అన్షును పెట్టి తీశారు. నడుము చూసి రావు రమేష్ షేక్ అయిపోతుంటే, ‘ఏమైంది నాన్నా’ అని అడుగుతాడు హీరో.
“ఇప్పటి పిఠాపురం ఎమ్మెల్యేగారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడ్డారో ఇప్పుడు నాకు అర్థమౌతోంది” అనే డైలాగ్ చెబుతారు రావు రమేష్. అయితే ఈ డైలాగ్ ను సెన్సార్ లో కట్ చేశారు. సినిమాలో అది తనకు ఇష్టమైన డైలాగ్ అంటున్నాడు సందీప్ కిషన్.
రావు రమేష్ రావట్లేదా.. రానివ్వట్లేదా..?
ఈ సినిమాలో హీరోతో సమానమైన పాత్ర పోషించారు రావు రమేష్. సినిమాలో ఆయన కూడా హీరోనే అని స్వయంగా సందీప్ కిషన్ ప్రకటించాడు. ఇంత ప్రాధాన్యమున్న పాత్ర పోషించిన రావు రమేశ్, మజాకా సినిమా ప్రచారంలో మాత్రం కనిపించడం లేదు.
దాదాపు 10 రోజులుగా నడుస్తున్న ఈ సినిమా ప్రచారంలో హీరోహీరోయిన్లు, దర్శక-రచయితలు కనిపిస్తున్నారు తప్ప రావురమేష్ ఇంతవరకు కనిపించలేదు. ఆయన కూడా వస్తే సినిమాకు మరింత మైలేజీ వస్తుంది.
సాధారణంగా రావు రమేష్ సినిమాల ప్రచారానికి రారు. కానీ ఇది ఆయన చుట్టూ తిరిగిన సినిమా కాబట్టి, ఆయనొస్తే బాగుండేది. రిలీజ్ కు ఇంకా 3 రోజులు టైమ్ ఉంది. ఈ గ్యాప్ లోనైనా ఆయన ప్రచారం చేస్తారేమో చూడాలి.
అందులో తప్పు ఏముంది
నా కొడకా నీ అమ్మ అనేవి బూతులు కానప్పుడు ఈ మాటలో తప్పు ఏంటి???
Okkk
అసలు కథ pendrive బయటకు వస్తుంది అనేనా???
కళ్ళు తెరిచి చుస్తే ఆయన కనపడతాడు ప్రచారంలో వున్నాడా లేదా అని …
Chalu idi kuda poye moviene
పవన్ నాలుగో (ప్యాలెస్) పెళ్ళాం రెఫరెన్స్ లేదా??
Why not?? సిద్ధం షేయ్యండి
చెత్త లా ఉంది డైలాగ్. పిఠాపురం MLA గారు అనకూడదు రా అయ్యా , ఖుషీ మూవీ లో సిద్ధు అను. Minimum common sense , you trying to refer People elected Designation for a scene acted by that person.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
కాకపట్టాలని చూసాడు..కాక వదిలేలా రివర్స్ అయింది