పట్టపగలు.. నడిరోడ్డు.. వరుస హత్యలు

హైదరాబాద్ లో పట్టపగలు నడిరోడ్డుపై హత్యలు ఎక్కువైపోతున్నాయి.

హైదరాబాద్ లో పట్టపగలు నడిరోడ్డుపై హత్యలు ఎక్కువైపోతున్నాయి. మొన్నటికిమొన్న అన్నను, తమ్ముడు నడిరోడ్డుపై అందరి కళ్లముందు దారుణంగా హత్య చేసిన ఘటన మరవకముందే, అలాంటిదే మరో ఘటన జరిగింది.

ఈసారి కన్నతండ్రిని రోడ్డుపై అందరి ముందు పొడిచి చంపేశాడు కొడుకు. 3 రోజుల కిందట జరిగిన హత్యకు, ఈరోజు జరిగిన హత్యకు 2 సారూప్యతలున్నాయి. రెండు హత్యలు ఒకే ఏరియాలో జరిగాయి. పైగా ఈ రెండు హత్యలకు కారణం మద్యపానమే.

మొగిలి (45), అతడి కొడుకు సాయికుమార్ (25) ఒకే కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. మొగిలి రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి గొడవ చేస్తుండడంతో సాయి విసిగిపోయాడు. రాత్రి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.

ఈరోజు ఉదయం కూడా తండ్రికొడుకుల మధ్య గొడవలు జరిగాయి. గొడవ జరిగిన తర్వాత మొగిలి బయటకెళ్లాడు. అప్పటికే తండ్రిని చంపేయాలని డిసైడ్ అయిన కొడుకు, అతడ్ని అనుసరించాడు. మొగిలి సిటీ బస్సు ఎక్కడం చూసి తను కూడా బైక్ పై ఫాలో అయ్యాడు.

ఈసీఐఎల్ బస్టాండ్ వద్ద బస్సు దిగిన తండ్రిని, వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణరహితంగా పొడిచాడు సాయికుమార్. ఈ దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాడు.

10-15 కత్తిపోట్లకు గురైన మొగిలిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. హత్య చేసిన సాయికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో వారం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.

7 Replies to “పట్టపగలు.. నడిరోడ్డు.. వరుస హత్యలు”

    1. అందుకే కదా మన్ దు sitting కి పిలిచి lepeyalani ట్రై చేసాడు మన యూత్ gem గారు.

Comments are closed.