అరుంధతి.. అఖండ.. హైబ్రీడ్

ఓదెల 2 అని కాకుండా మరేదైనా మంచి సంస్కృత పదం టైటిల్ గా పెట్టి వుంటే ఓ లెక్కలో వుండి వుండేది.

ఓదెల అన్న సినిమా చాలా చిన్న సినిమా. ఓటిటిలో వచ్చింది. అందరినీ ఆకట్టుకుంది. ఓదెల 2 అంటూ ఓ సినిమా స్టార్ట్ చేసారు సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో. ఆరంభంలో ఈ సినిమా ఓ మీడియం బడ్జెట్ సినిమాగా అనుకున్నారు. ఇప్పుడు 30 కోట్ల బడ్జెట్ కు చేరి, పెద్ద సినిమాగా మారుతోంది. అంత సీన్ ఏముందా అనుకున్నారు అంతా. తమన్నా మీద అంత బడ్జెట్ అని కూడా అనుకున్నారు.

కానీ ఈ రోజు టీజర్ వచ్చిన తరువాత క్లారిటీ వచ్చింది. ఓదెల 2 కి ఆ టైటిల్ తప్పు పెట్టారు అని. ఓదెల 2 అని కాకుండా మరేదైనా మంచి సంస్కృత పదం టైటిల్ గా పెట్టి వుంటే ఓ లెక్కలో వుండి వుండేది. టీజర్ ఆ రేంజ్ లో వుంది. ఓదెలకు..ఓదెల 2 కి అస్సలు సంబంధం లేదు..అది రూపాయి సినిమా అంటే ఇది పది రూపాయల సినిమా అనే రేంజ్ లో వుంది.

టీజర్ కంటెంట్ చూస్తుంటే అప్పట్లో వచ్చిన అరుంధతి గుర్తుకు వచ్చంది. ఎందుకుంటే అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మిస్టిక్ హర్రర్ సినిమా కనుక. అలాగే అఖండ సినిమా కూడా గుర్తుకు వచ్చింది. ఎందుకంటే అఘోరా అన్నది కీలక పాత్ర కనుక. మొత్తం మీద ఓదెల 2 టీజర్ ఓ సర్ప్రయిజ్ గా వచ్చింది. ఇప్పటి వరకు దీని గురించి పెద్దగా మాట్లాడింది లేదు. ఇప్పుడు ఇది వార్తల్లోకి వచ్చింది. మార్కెట్ దృష్టి ఇప్పుడు దీని మీదకు వస్తుంది, ఇప్పటికే నాన్ థియేటర్ హిందీ శాటిలైట్, ఓటిటి అమ్మేసారు. ఇక థియేటర్ మిగిలింది.

తమన్నా లుక్స్, అజనీష్ మ్యూజిక్, కంప్యూటర్ గ్రాఫిక్స్ టీజర్ కు ప్లస్. ఈ సినిమాకు దర్శకుడు అశోక్ తేజ. నిర్మాత మధు.

4 Replies to “అరుంధతి.. అఖండ.. హైబ్రీడ్”

Comments are closed.