నారాయణ… సన్యాసం ప్రకటనే తరువాయి!

అమరావతిలో రాజధాని గురించి గత కొన్ని వారాలుగా ఇంత భారీస్థాయిలో రచ్చరచ్చ జరుగుతోంది. అయితే దీనంతటికీ మూలపురుషుడుగా ఉండవలసిన ఒక కీలకమైన వ్యక్తి మాత్రం ఈ యావత్ చర్చోపచర్చల్లో మిస్ అయ్యారు. ఆయన ఎక్కడా…

అమరావతిలో రాజధాని గురించి గత కొన్ని వారాలుగా ఇంత భారీస్థాయిలో రచ్చరచ్చ జరుగుతోంది. అయితే దీనంతటికీ మూలపురుషుడుగా ఉండవలసిన ఒక కీలకమైన వ్యక్తి మాత్రం ఈ యావత్ చర్చోపచర్చల్లో మిస్ అయ్యారు. ఆయన ఎక్కడా కనిపించుట లేదు. సులువుగానే ఊహించేస్తున్నారా..? అవును- ఆయన మాజీ మంత్రి నారాయణ!

రాజధాని ప్రాంత ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలు.. రకరకాల ప్రతిపాదనలు చేసి, ఇప్పుడున్న ప్రాంతంపై విముఖతను కూడా చెప్పివెళ్లిన తర్వాత.. చంద్రబాబు రాజధాని ఎంపిక కోసం నియమించిన, అమరావతి ప్రాంతంలో అనుకూలతల గురించి పరిశీలించడానికి ఏర్పాటు అయిన కొత్త కమిటీకి సారథి అప్పటి మంత్రి నారాయణ. ఆరకంగా అమరావతి ప్రాంతాన్ని రాజధాని కోసం ఎంపిక చేయడం అనే ప్రక్రియ మొత్తం.. నారాయణ చేతుల మీదుగానే జరిగింది. ఈ స్థలానికి తొలుత ముద్రవేసింది ఆయనే.

ఇవాళ ఈ స్థల ఎంపికే కరెక్టు కాదని, ముంపుప్రాంతంలో రాజధాని పెడుతున్నారని అంతా యాగీ చేస్తూ నానా గోలా అవుతోంటే… మంత్రి నారాయణ ఏమైపోయారు. తెలుగుదేశం తరఫున ఆయన ఎందుకు స్పందించడం లేదు. లాంటి సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. అయితే  విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఒక్క రాజధాని మాత్రమేకాదు, ఎలాంటి రాజకీయ వివాదాల్లోనూ ఇక మంత్రి నారాయణ గళం మనకు వినిపించదు. ఆయన అప్రకటితంగా, రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ, దానితోపాటు తాను కూడా 2019 ఎన్నికల పుణ్యమాని పూర్తిగా పతనం అయిన తర్వాత.. ఇక రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండాలని నారాయణ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ఆయన కూతురు ఇటీవల ముఖ్యమంత్రి జగన్ దంపతులను కలిసి.. తమ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నదని, ఎలాంటి రాజకీయాల జోలికి రాబోమని విన్నవించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ మేరకు నారాయణ సైలెంట్ అయ్యారు.

రాజధాని గురించి ఎన్ని వివాదాలు రేగుతున్నా.. ఆ స్థలం ఎంపిక చేసిన వ్యక్తిగా ఆయన ఒక్కమాట కూడా మాట్లాడకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. నారాయణ మీడియా ముందుకు రావడం అంటూ జరిగితే.. అది తన రాజకీయ సన్యాస ప్రకటనకే అనే సెటైర్లు కూడా పేలుతున్నాయి. 

సాహోపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే..?