Advertisement

Advertisement


Home > Politics - Gossip

కోర్టుకెక్కిన నవయుగ :: జాప్యం షురూ!

కోర్టుకెక్కిన నవయుగ :: జాప్యం షురూ!

పోలవరం ప్రాజెక్టు పనులకు రీటెండర్లు పిలవడం వలన అలవిమాలిన జాప్యం జరుగుతుందని అటు కేంద్రమంత్రి, పోలవరం అథారిటీ కూడా హెచ్చరించిన నేపథ్యంలో.. ఆ జాప్యం ఎలా జరుగుతుందా? అని కొందరికి సందేహాలు వచ్చాయి. నవంబరు 1 లోగా తిరిగి పనులను ఎట్టి పరిస్తథితుల్లోనూ మొదలెట్టేస్తాం. వర్షాకాలంలో ఎటూ పనులు జరగవు. కాబట్టి జాప్యం ప్రశ్నేలేదు.. అంటూ ఇలాంటి వాదనలను రాష్ట్ర నీటివనరుల మంత్రి అనిల్ కుమార్ కొట్టిపారేశారు. అయితే రీటెండర్లకు వెళ్లడం వలన.. జాప్యం ఎలా జరుగుతుందో.. ఇప్పుడు కనిపిస్తోంది. ఈ పనులను కోల్పోయిన నవయుగ సంస్థ.. కోర్టును ఆశ్రయించింది. రద్దు ఉత్తర్వుల్లో లోపాలే ప్రాతిపదికగా వారు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో జాప్యం అనివార్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తికావాలని మాత్రమే రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటారు. వీలైనంత వరకు అవినీతి లేకుండా పనులు జరగాలని కూడా ప్రజలు అభిలషిస్తారు. ఆ పనులను నవయుగ సంస్థ చేపడుతోందా? ఇంకెవరైనానా? అనేది ప్రజలకు అవసరం లేదు. అయితే జగన్ మోహన్ రెడ్డి సర్కారు మాత్రం.. అథారిటీ చెప్పినా, కేంద్రం చెప్పినా పట్టించుకోలేదు. సమీక్ష సమావేశం పెట్టి వారంలోగా టెండర్లు పిలవాలని ఆదేశించేశారు. ఎలాంటి జాప్యమూ జరగడానికి వీల్లేదని అన్నారు. తదనుగుణంగా రీటెండర్లకు నోటిఫికేషన్ వచ్చేసింది.

ఇప్పుడు నవయుగ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. రీటెండర్లను పిలవకుండా ఆపు చేయాలంటూ హైకోర్టును కోరింది. ఆ ఉత్తర్వులు రావడానికి పెద్ద అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అంటే రీటెండర్ల వ్యవహారంపై స్టే వస్తుంది. కోర్టు కేసు ఎప్పటికి తేలుతుందో.. ఎప్పటికి మళ్లీ పోలవరం పనులు మొదలవుతాయో అంత సులువుగా చెప్పలేని పరిస్థితి.

నిజానికి నవయుగతో కాంట్రాక్టును రద్దుచేస్తూ జగన్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులు, రాసిన లేఖ సమగ్రంగా లేకపోవడం వల్లనే.. వ్యవహారం కోర్టుకు వెళ్లడానికి అనువుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒప్పందంలో ఏం ఉల్లంఘించామో చెప్పకుండా కాంట్రాక్టును రద్దు చేయడాన్ని నవయుగ తప్పుపట్టింది.

వ్యవహారం కోర్టుకెళ్లిన నేపథ్యంలో మహా అయితే రీటెండరింగ్ ప్రక్రియ షురూ కావచ్చుగానీ.. కోర్టు కేసు తేలేదాకా కొత్త కాంట్రాక్టర్ల చేతికి పనులు అప్పగించడం మాత్రం సాధ్యం కాకపోవచ్చు.

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?