చదువుకోమంటే కూడా తప్పేనా?

కారణాలు ఏమైనా కావొచ్చు.. ప్రభుత్వ  కళాశాలలు అంటే విద్యార్థుల్లో కూడా కొంత నిర్లక్ష్యం. లక్షలు పోసి కాలేజీలకు ఫీజులు కడితే.. అదేదో శిక్ష అనుభవిస్తున్నట్లుగా క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్లేవారు.. ప్రభుత్వ కాలేజీల విషయానికి…

కారణాలు ఏమైనా కావొచ్చు.. ప్రభుత్వ  కళాశాలలు అంటే విద్యార్థుల్లో కూడా కొంత నిర్లక్ష్యం. లక్షలు పోసి కాలేజీలకు ఫీజులు కడితే.. అదేదో శిక్ష అనుభవిస్తున్నట్లుగా క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్లేవారు.. ప్రభుత్వ కాలేజీల విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం వహిస్తారు. ఏడాది పొడవునా కాలేజీ ఎగ్గొట్టినా.. పరీక్ష రాసేద్దామనే ధీమా. ఏదో అత్తెసరుగా పాస్ మార్కులు వస్తే చాల్లేననే అలక్ష్యం. అయితే జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఇలాంటి పోకడలకు చెక్ పెట్టదలచుకుంది. ప్రధానంగా ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్థులు డుమ్మా కొట్టడాన్ని గణనీయంగా తగ్గించడానికి కొత్త నిర్ణయాలు చేసింది.

జూనియర్ కాలేజీ విద్యార్థులకు హాజరు కనీసం 60 శాతం ఉంటేనే పరీక్షకు అనుమతిస్తారు. అంతకంటె తక్కువ ఉంటే ప్రెవేటు స్టూడెంటుగా పరీక్ష రాయాలి. 60 నుంచి 75 శాతం వరకు హాజరు ఉన్న వారు 1000, 1500, 2000 రూపాయల ఫైను కట్టాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫైన్లు 200 నుంచి 500 రూపాయల వరకు ఉండేవి. వాటిని భారీగా పెంచారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచదలచుకున్న ప్రభుత్వం.. వారి నైపుణ్యాభివృద్ధికి అనేక కొత్త పథకాలు తెస్తున్న సంగతి తెలిసిందే. అసలు  కాలేజీ చదువుల మీదే పట్టు లేకుండా.. అదనపు నైపుణ్యాలు ఎన్ని జతచేసిన నిష్ఫలం అనే ఉద్దేశంతో ఇలా హాజరు పెంచడానికి కొత్త ఆదేశాలు తెచ్చారు.

దీనివల్ల.. ప్రభుత్వ కళాశాలల్లో గైర్హాజరు తగ్గి.. విద్యార్థులు అంతో ఇంతో మెరుగ్గా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణ స్థాయి విద్యార్థులే అయినప్పటికీ.. క్రమం తప్పకుండా కాలేజీకి వస్తుండడం వల్ల.. కొంత శ్రద్ధ పుట్టే అవకాశం ఉంది.

అయితే ఇలా పిల్లలు బాగా చదువుకోవాలనే కోరికతో తెచ్చిన నిబంధన పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో పేద పిల్లలు ఉంటారు.. వారు రకరకాల పనుల వల్ల ,ఆర్థిక ఇబ్బందుల వల్ల కాలేజీకి రాలేరు.. ఫైన్లు పెంచడం కరెక్టు కాదు.. అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి స్కూలు విద్యార్థులకు ప్రకటించిన అమ్మఒడిని జగన్మోహన రెడ్డి ఇంటర్మీడియట్ వారికి కూడా ఇస్తున్నారు. ఇంకా ఆర్థిక ఇబ్బందుల పేరు చెప్పి.. కాలేజీ ఎగ్గొట్టే వారిని సమర్థించడం.. వారి మీద సానుభూతి పేరుతో మాయమాటలు చెప్పడం, వారి విద్యానైపుణ్యాలు మెరుగుపడడం ఇష్టంలేని వారి కుట్రపూరిత దుష్ప్రచారమే అనిపించుకుంటుంది.

రష్మికని దారుణంగా ఆడేసుకున్నారు