సొల్యూషన్ అక్కర్లేదు.. చర్చ జరిగితే చాలు!

మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చిత్రంగా ఉంది. తెలంగాణలో ముస్లింలు తమ పార్టీ పట్ల కినుక వహించకుండా, కోప్పడకుండా ఉండాలన్నది మాత్రమే ఆయన కోరిక. అంతే తప్ప.. ముస్లింలను ఏ సమస్య అయితే…

మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చిత్రంగా ఉంది. తెలంగాణలో ముస్లింలు తమ పార్టీ పట్ల కినుక వహించకుండా, కోప్పడకుండా ఉండాలన్నది మాత్రమే ఆయన కోరిక. అంతే తప్ప.. ముస్లింలను ఏ సమస్య అయితే ఆందోళనకు గురిచేస్తున్నదో.. ఆ సమస్యకు పరిష్కారం ఆయన లక్ష్యం కాదు! ఆ సమస్య తీర్చడం కోసం పోరాడాలని ఆయన సంకల్పించడం లేదు. ఇక్కడ కేవలం వ్యర్థ ప్రసంగాలతో ముస్లింలను ‘ఇంప్రెస్’ చేయాలని అనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్… అటు తమ మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆగ్రహించకుండా ఉండేలా.. పావులు కదుపుతున్నారు. ఆచితూచి మాట్లాడుతున్నారు.

సీఏఏ, ఎన్నార్సీ వ్యవహారాలపై దేశవ్యాప్తంగా ఎంత రాద్ధాంతం జరుగుతున్నదో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం మొత్తం.. సీఏఏ విషయంలో ఆందోళనలకు గురవుతోంది. సీఏఏ అనేది ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి కాదు.. అనే ఒకే ఒక మాట చెబుతుందే తప్ప.. ఈ చట్టం విషయంలో ఆ సమాజంలో ఉన్న అనుమానాల్ని భయాల్ని నివృత్తి చేయడానికి కేంద్రం ప్రనయత్నించడం లేదు. మరో రకంగా చెప్పాలంటే.. వారి భయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడంలేదు. తమ ధోరణిలో తాము పోతున్నారు.

అయితే చట్టాలను పార్లమెంటులో వ్యతిరేకించినప్పటికీ.. ఆ తర్వాత మొన్నమొన్నటిదాకా వాటిని వ్యతిరేకించడం గురించి పట్టించుకోని కేసీఆర్.. హైదరాబాదులో ఉధృతమైన స్థాయిలో నిరసనజ్వాలలు ఎగసిపడిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిన తర్వాత.. ముస్లిం అనుకూల ప్రకటన చేశారు. అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపుతాం అన్నారు.

ఇవాళ అసెంబ్లీలో ఆయన ఇంకా చిత్రంగా మాట్లాడుతున్నారు. సీఏఏ బిల్లుపై శాసనసభలో చ చర్చ జరగాల్సిందే. మన వినతిపై కేంద్రం సానుకూలంగా ఉంటుందా లేదా అనేది వేరే సంగతి… కానీ చర్చ మాత్రం జరగాల్సిందే అంటున్నారు. రాష్ట్రప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియేస్తా అని మాత్రమే అంటున్నారు.

ఈ మాటల్లో- శాసనసభలో చర్చించడమూ.. తీర్మానం ఢిల్లీ పంపడమూ తప్ప.. సమస్య పరిష్కారం కావాలనే కోరిక ఉన్నట్లు కనిపించడం లేదు.

వీడు మా అమ్మ నాన్న కంటే బాగా చూసుకున్నాడు