Advertisement

Advertisement


Home > Politics - Gossip

రఘురామకు సినిమా చూపించిన కమలం!

రఘురామకు సినిమా చూపించిన కమలం!

నరసాపురం ఎంపీగా నేను ఈసారి ఎన్నికల్లో పోటీచేయబోయేది గ్యారంటీ. తప్పకుండా పోటీచేస్తున్నా.. మళ్లీ గెలుస్తా! ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననేది మాత్రం తర్వాత చెప్తాను. నేను మాత్రం ఖచ్చితంగా ఎన్డీయే (విపక్ష) కూటమి తరఫునే పోటీచేస్తున్నా. తెలుగుదేశం- బిజెపి- జనసేనల్లో ఏ పార్టీ తరఫున అనేది తర్వాత చెప్తా.. ఇలాంటి అతిశయమైన డైలాగులు గుర్తుకు వస్తే చాలు.. చాలా చాలా ఓవరాక్షన్ చేస్తూఉండే రఘురామక్రిష్ణ రాజు అందరికీ గుర్తుకు వస్తారు.

ఎటువైపు దూకుదామా అని నిర్ణయించుకోకుండా గోడమీద నింపాదిగా కూర్చున్న పిల్లి మాదిరిగా ఆయన ఇన్నాళ్లూ రోజులు నెట్టుకుంటూ వచ్చారు. కానీ.. రఘురామక్రిష్ణరాజుకు భారతీయ జనతా పార్టీ సినిమా చూపించింది. అది కూడా సెవెన్టీ ఎమ్మెమ్ లో చూపించింది.

అసలు పార్టీలను వాటి ప్రాధాన్యాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా.. ఆయా పార్టీల నాయకులతో తాను లోపాయికారీగా మెయింటైన్ చేసే సంబంధాలే ఎక్కువగా పనిచేస్తాయని, తనకు టికెట్ వచ్చేలా చేస్తాయని విర్రవీగిన రఘురామక్రిష్ణ రాజుకు ఇది పెద్ద షాక్ అని చెప్పాలి.

ఎందుకంటే.. ఆదివారం సాయంత్రం టికెట్లు ప్రకటించనున్న భాజపా.. ఏపీనుంచి పోటీచేసే ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసింది. అందులో నరసాపురం నియోజకవర్గం నుంచి శ్రీనివాసవర్మను ఎంపిక చేశారు. రఘురామక్రిష్ణ రాజు పేరు సోదిలో లేకుండాపోయింది.

బిజెపి పోటీ చేస్తున్న ఆరుస్థానాల్లో.. రాజమండ్రి నుంచి రాష్ట్ర పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, తిరుపతి నుంచి (వైసీపీ నుంచి ఫిరాయించి కొత్తగా పార్టీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే) వరప్రసాద్, నరసాపురం నుంచి శ్రీనివాసవర్మ ఖరారయ్యారు.

తనకు మించి నరసాపురంలో పోటీ చేయగల వ్యక్తి ఎన్డీయే కూటమిలోని మూడు పార్టీల్లో ఎవ్వరికీ దొరకరు అన్నంతగా చెలరేగిన రఘురామక్రిష్ణ రాజుకు రిక్తహస్తం ఎదురైంది. ఆయన అహంకారపు మాటలు, గెలిచిన తర్వాత అయిదేళ్లలో ఒక్కసారికూడా నియోజకవర్గ ప్రజల మొహం చూడకపోవడం, గెలిపించిన వైసీపీకి వెన్నుపోటు పొడవడం ఇలాంటి లక్షణాలన్నీ కలిపి ఆయన మీద పార్టీలకు నమ్మకాన్ని దూరం చేశాయని ప్రజలు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?