కమలనేతలంతా చేతబడితో చస్తున్నారట!

నాయకులు మరణించిన తర్వాత… వారి గురించి.. ఎవరూ చెడుగా మాట్లాడరు. అప్పటిదాకా వారి వారి తీరుతెన్నులు విధానాలతో తీవ్రంగా విభేదించిన ప్రత్యర్థులు కూడా.. మరణించిన నేత యొక్క గొప్ప లక్షణాలను మాత్రమే గుర్తు చేసుకుంటూ…

నాయకులు మరణించిన తర్వాత… వారి గురించి.. ఎవరూ చెడుగా మాట్లాడరు. అప్పటిదాకా వారి వారి తీరుతెన్నులు విధానాలతో తీవ్రంగా విభేదించిన ప్రత్యర్థులు కూడా.. మరణించిన నేత యొక్క గొప్ప లక్షణాలను మాత్రమే గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తారు. అలాగే.. మరణించిన నాయకుడి పార్టీ వారు కూడా.. తమ నాయకుడికి నివాళి అర్పించడం ఒక్కటే ప్రాధాన్యంగా భావిస్తారు. కానీ.. భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తీరు వేరు. తరచూ తన మాటలతో, చేతలతో వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే ప్రజ్ఞా ఠాకూర్ ఇప్పుడు అరుణ్ జైట్లీ మరణానంతరం మరో వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లోకి వచ్చారు.

భారతీయ జనతా పార్టీకి సీనియర్లయిన నాయకులు.. తమ తమ రాజకీయ ప్రత్యర్థులు చేతబడితో చంపిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. తమ ప్రతిపక్షం తమ పార్టీ నాయకులను తుదముట్టించడానికని ‘మారక శక్తి’ (చంపడానికి వాడే క్షుద్రశక్తి)ని ప్రయోగిస్తున్నదని వ్యాఖ్యానించడం విశేషం. భాజపా నేతల్లో ఇటీవలి నెలరోజుల్లోనే ముగ్గురు ముఖ్యమైన నేతలు మరణించారు. ఇది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే. మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 6వతేదీన కన్నుమూశారు.

ఇరవై రోజులైనా గడవకముందే ఆగస్టు 21న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్ మరణించారు. ఆ తర్వాతి మూడు రోజులకే కేంద్ర మాజీమంత్రి రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఒకేనెలలో ఆ పార్టీ ముగ్గురు ముఖ్యమైన నేతల్ని కోల్పోయింది. నాయకులకు నివాళి అర్పించడానికి పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ మరణాల వెనుక క్షుద్ర, దుష్టశక్తులు ఉన్నాయని వ్యాఖ్యానించడం విశేషం.

అంతటితో ఆమె ఆగలేదు. ‘నేను లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న సమయంలో.. ఈ విషయం నాకు ఒక స్వామీజీ చెప్పారు. మారకశక్తి (చేతబడి వంటి క్షుద్ర విద్యలు)ని ప్రతిపక్షం వారు భాజపా నాయకుల మీద ప్రయోగిస్తున్నారని, అందుచేత ప్రార్థనలతో నన్ను నేను మరింత బలంగా తీర్చిదిద్దుకోవాలని’’ స్వామీజీ చెప్పినట్లుగా ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు. తాను కూడా వారికి ఒక టార్గెట్ కనుక తనను ధ్యానం, ప్రార్థనలు తగ్గించవద్దని ఆ స్వామీజీ ఆమెతో చెప్పారట.

మరోవైపు భాజపా నాయకులు మాత్రం.. ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని అంటున్నారు. కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలను దురదృష్టకరమైనవిగా కొట్టిపారేసింది. మరణించిన నాయకులు ముగ్గురూ ఎంతో గౌరవింపబడ్డారని.. అలాంటి వారిపై చేతబడి ప్రయోగించామంటూ మాట్లాడడం విజ్ఞత కాదని వ్యాఖ్యానించింది.

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!