పాతవాళ్లూ.. దూరం.. దూరం

కొత్త నీరు వస్తే పాత నీరు మాయం కావడం నదులకు మామూలే. జనసేన లాంటి రాజకీయ పార్టీ కూడా ఇదే పంథా అనుసరిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. Advertisement విశాఖ ప్రాంతంలో…

కొత్త నీరు వస్తే పాత నీరు మాయం కావడం నదులకు మామూలే. జనసేన లాంటి రాజకీయ పార్టీ కూడా ఇదే పంథా అనుసరిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

విశాఖ ప్రాంతంలో చిరకాలంగా పార్టీ కోసం పని చేసిన వారు ఇప్పుడు వారిలో వారే మధనపడుతున్న పరిస్థితి. కొత్తగా వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారు. టికెట్‌లు ఇచ్చేలా చూస్తున్నారు. ఇన్నాళ్లుగా పార్టీని బతికించుకుంటూ, నిలబెట్టుకుంటూ వచ్చిన వారిని మాత్రం దూరం పెడుతున్నారు.

పైగా నిన్న, మొన్న విశాఖ వెళ్లి వచ్చిన తరువాత పవన్ తన వ్యక్తిగత సిబ్బందికి ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారని గుసగుసలు వినినిపిస్తున్నాయి. పాతవారు ఎవరైనా తన అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వనవసరం లేదని, తనకు చెప్పకుండా ఎవరినీ తీసుకువచ్చి, తనను కలిపించే ప్రయత్నం చేయవద్దని పవన్ ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

విశాఖలో శివశంకర్, పంచకర్ల లాంటి వారి పేర్లు ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. కొత్తగా వచ్చిన విజయ్ కుమార్, కొణతాల రామకృష్ణ, వలస వచ్చిన సోదరుడు నాగబాబు పేర్లే ఎక్కువ వినిపిస్తున్నాయి.

సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తమ పార్టీ వుంటుందని పదే పదే చెబుతూ వచ్చిన పవన్ ఇప్పుడు ఇలా మారిపోవడంతో సీనియర్లు ఏమీ పైకి మాట్లాడలేక, వారిలో వారు తమ భావాలు పంచుకుంటూ, నిట్టూరుస్తున్నారు.