జనసేన అధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి అమెరికా బయల్దేరి వెళ్లారు. ఆదివారం రాత్రి ఆయన బయల్దేరి అమెరికా వెళ్లారని తెలుస్తోంది.
ఎందుకు వెళ్లారు అన్నది క్లారిటీ లేదు. పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని వినిపిస్తోంది. కాదు అక్కడ ఓ మీటింగ్ వుందని, దానికి హాజరు కావడానికి వెళ్లారని కూడా తెలుస్తోంది. ఈ రెండూ కాదు హెల్త్ చెకప్ కూడా వుందని వినిపిస్తోంది.
ఇవేవీ కాదని, పార్టీకి ఆర్థికవనరులు సమకూర్చే పని మీద ఓ కీలక సమావేశం అమెరికాలో ఏర్పాటు చేసారని, దానికే వెళ్లారని వినిపిస్తోంది.
మొత్తం మీద పవన్ అయితే అమెరికా వెళ్లారు. ఈ నెలాఖరుకు కానీ రారు అన్నది విశ్వసనీయ వర్గాల బోగట్టా. పవన్ వచ్చేనెల 16 నుంచి హరి హర వీరమల్లు సినిమా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. అమెరికా నుంచి తిరిగి రావడం, ఆపై దసరా సెలవులు, పూజలు వుండనే వుంటాయి.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 కార్యక్రమానికి హాజరు కమ్మని అడిగారు. దానికి వెళ్లాలా? వద్దా? అన్నది డిసైడ్ కాలేదు. వెళ్లకపోవడానికే ఎక్కువ అవకాశం వుందని తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ కూడా అన్ స్టాపబుల్ ప్రొగ్రామ్ కు వెళ్లడానికి పెద్దగా సుముఖంగా లేరని తెలుస్తోంది.