cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

అభ్యర్థుల వేట.. బాబు బాటలో పవన్ కల్యాణ్

అభ్యర్థుల వేట.. బాబు బాటలో పవన్ కల్యాణ్

2024 ఎన్నికల కోసం చంద్రబాబు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా స్వయంగా బాబే అభ్యర్థుల పనితీరు ముదింపు చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుతున్న నాయకులకే టిక్కెట్లు ఇస్తామని ఆల్రెడీ చెప్పేశారు కూడా. దీనికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీని పక్కనపడేశారు. తాను దగ్గరుండి చేయించుకున్న సర్వే ఆదారంగా అభ్యర్థుల్ని నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే పని చేయబోతున్నారు.

గత ఎన్నికల్లో నాదెండ్ల ఆధ్వర్యంలో అంతర్గతంగా వేసిన స్క్రీనింగ్ కమిటీ ఆధారంగా అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ కల్యాణ్, ఈసారి బాబు బాటలో తను కూడా సర్వే చేయించాలని నిర్ణయించారు. అయితే బాబుకు సర్వేల విషయంలో మంచి టీమ్ ఉంది. అనుకూల మీడియా అండదండలున్నాయి. పవన్ కు అలాంటి వనరులు అందుబాటులో లేవు. అందుకే ముంబయికి చెందిన ఓ సంస్థకు ఈ సర్వే బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారట.

ఏపీలోని 13 జిల్లాల్లో జనసేన తరపున ఈ థర్డ్ పార్టీ రంగంలోకి దిగుతుంది. అసలు ఎవరు ఏంటనేది బయటపడకుండా జరిగే సీక్రెట్ సర్వే ఇది. సర్వే చేస్తున్నవారు ఎవరో బయటకు తెలిస్తే.. వారిని ప్రసన్నం చేసుకోవడం, వారి వద్ద నాలుగు మంచి మాటలు చెప్పించుకోవడం అభ్యర్థులకు అలవాటే. అందుకే అలాంటి వాటికి దూరంగా జనసేన ఓ రహస్య సర్వే చేపట్టబోతోంది. అయితే కార్పొరేట్ కంపెనీలకు ఇలాంటి వ్యవహారాలు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది తేలాల్సి ఉంది.

ముంబై బేస్డ్ కంపెనీ అంటే కచ్చితంగా సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడే అవకాశముంది. ప్రస్తుతం జనసేనలో ఉన్నవారంతా సోషల్ మీడియా పులులే. సరిగ్గా జనాల్లోకి వెళ్లేవారు చాలా అరుదు. అధినేత రాజకీయం సోషల్ మీడియా చుట్టూ ఎలా తిరుగుతుందో.. జనసైనికులు కూడా సోషల్ మీడియా పోస్టింగ్ లతో హడావిడి చేసేవారే. మరి వీరిని అంచనా వేసే ముంబై సంస్థ ఈ పోస్టింగ్ లనే లెక్కలోకి తీసుకుంటే అసలుకే మోసం వస్తుంది. అదే జరిగితే జనసేన రాజకీయం సాగినట్టే.

అభ్యర్థులు లేని పార్టీకి సర్వే అవసరమా?

పోనీ ఈ సర్వే అంతా బాగానే సాగినా.. జనసేనకు అభ్యర్థులు దొరుకుతారా అనేదే అసలు ప్రశ్న. గత ఎన్నికల్లో ఇలానే సోలోగా పోటీ అంటూనే, చాలా స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క పొత్తుపెట్టుకున్న పార్టీలకు అప్పగించేశారు పవన్. ఈసారి ఎలాగూ బీజేపీ ఉండనే ఉంది. చివరాఖరిలో టీడీపీతో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ పవన్ మాత్రం నియోజకవర్గానికి ఇద్దర్ని సెలక్ట్ చేసి ఆ లిస్ట్ తన ముందు పెట్టాలని అంటున్నారట.

ఆ లెక్కన ఔత్సాహికుల లిస్ట్ తెస్తే, దాన్ని పవన్ ఫైనల్ చేస్తే, చివరికి వారిలో మూడొంతుల ముంది త్యాగరాజులుగా మారల్సి వస్తే.. ఏంటో పవన్ రాజకీయం అంతా ఊహాగానంగానే తోస్తోంది. అయితే పవన్ మాత్రం ఎన్నికలకు రెండేళ్ల ముందే హడావిడి మొదలు పెట్టారు. అభ్యర్థులను వడపోస్తున్నారు. 2022 మొత్తం సినిమాలు చేసి, 2023 నుంచి పూర్తిగా రాజకీయాల వైపు వచ్చేయాలనేది పవన్ ఆలోచన. 

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!