Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబుతో ‘ప్రైవేట్ మీటింగ్’ : కన్నీళ్లే కన్నీళ్లు!

బాబుతో ‘ప్రైవేట్ మీటింగ్’ : కన్నీళ్లే కన్నీళ్లు!

చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వం కార్యకర్తలపై చేస్తున్న దాడులు అడ్డుకోవాలని నినదించారు. ‘అవసరమైతే’ చంద్రబాబు వెళ్లి గ్రామాల్లో జిల్లాల్లో ఉండి పోరాడుతారని అన్నారు. అన్న క్యాంటీన్ల మూసివేతపై పోరాడాలని అన్నారు. ఇవన్నీ నిర్ణయాలు కాగా, ప్రతి సమావేశంలోనూ రివాజుగా జరిగినట్లుగానే.. పాలిట్ బ్యూరోలో కూడా కొందరు ‘మీరు ఓడిపోవడం ఏంటయ్యా’ అనే అర్థం వచ్చేలాగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతవరకు వార్తలు వచ్చాయి.

అయితే సమావేశంలో ఇంకా చాలా కన్నీళ్లే ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. పాలిట్ బ్యూరో రూపేణా భేటీ అయిన వారంతా సీనియర్లు, కీలక నాయకులు. వీరిలో కొందరు చంద్రబాబునాయుడుతో వన్-టు-వన్ ఆంతరంగిక భేటీలు కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో మరో రకమైన భయాలను వ్యక్తంచేస్తూ... దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేసి... చంద్రబాబు ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నారని సమాచారం.

చంద్రబాబునాయుడు క్రమంగా తన అభిప్రాయాలను ట్వీట్లుగా చెప్పడం పెంచుకుంటున్నారు. ప్రెస్ మీట్‌లు ఇప్పుడు తగ్గిపోయాయి. ఇదివరలో అయితే దాదాపు రోజుకో ప్రెస్ మీట్ ఉండేది. అప్పుడంటే సీఎం కూదా అని సమర్థించుకోవచ్చు. ప్రతిపక్షనేతగా జగన్.. ఈ మాత్రం ప్రెస్ మీట్ లు కూడా పెట్టలేదని ఎదురుదాడి చేయవచ్చు. కానీ జగన్ ఇప్పుడు కూడా పెట్టడంలేదు. చంద్రబాబు అప్పట్లో చాలా చురుగ్గా పెట్టేవారు. ఇప్పుడు ఆయనలో చురుకుదనం తగ్గింది. అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత అది స్పష్టంగా కనిపిస్తోంది.

ఇలాటి సమయంలో చంద్రబాబు త్వరలోనే మంచిరోజు చూసుకుని, తనయుడు నారాలోకేష్ చేతికి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ ప్రచారం.. చాలామంది సీనియర్లకు ఆందోళన కలిగిస్తోంది. వారు బాబుతో ఆంతరంగికంగా భేటీ అయినప్పుడు, లోకేష్ కు సారథ్యంపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట.

ఇప్పటికే లోకేష్ పుణ్యమాని పార్టీకి జరగవలసినంత డ్యామేజీ జరిగిందని.. పార్టీ వచ్చే ఎన్నికల వరకు కూడా.. చంద్రబాబు నేతృత్వంలోనే పోరాడుతుందని, ప్రజల కోసం పనిచేస్తుందని ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తే తప్ప.. నిలదొక్కుకోవడం కష్టమని వారు అంటున్నారుట. లోకేష్ చేతికి సారథ్యం అనే ఆలోచన రానివ్వకండి సారూ.. అంటూ బోరుమంటున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?