రవిప్రకాష్ అరెస్ట్

టీవీ 9 మాజీ సిఇఒ అరెస్ట్ అయ్యారా? ఆయన సన్నిహిత వర్గాల ట్వీట్ లు చూస్తుంటే కరెక్ట్ అనే తెలుస్తోంది. ఈ ఉదయం కొంతమంది పోలీసులు రవిప్రకాష్ ఇంటికి వచ్చి, స్టేషన్ కు రావాలని…

టీవీ 9 మాజీ సిఇఒ అరెస్ట్ అయ్యారా? ఆయన సన్నిహిత వర్గాల ట్వీట్ లు చూస్తుంటే కరెక్ట్ అనే తెలుస్తోంది. ఈ ఉదయం కొంతమంది పోలీసులు రవిప్రకాష్ ఇంటికి వచ్చి, స్టేషన్ కు రావాలని కోరారని, ఆ తరువాత అరెస్ట్ చేసినట్లు తెలుస్తోందని, కారణాలు తెలియవని మీడియా వర్గాల బోగట్టా. మోజో టీవీ మాజీ సిఇఒ రేవతి కూడా ఈ మేరకు ఓ ట్వీటు వేసారు. 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం రవిప్రకాష్ మరో ఇద్దరు కీలక ఉద్యోగులు కలిసి మూడు సార్లు భారీ మొత్తాలు టీవీ 9 అక్కౌంట్స్ లోంచి వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నారని, అది ఇప్పుడు కొత్త యాజమాన్యం శోధనతో తేలిందని, ఈ మేరకు ఫిర్యాదు చేసారని తెలుస్తోంది.

ఇలా తీసుకున్నమొత్తాలను బోనస్/ఎక్స్ గ్రేషియాగా చూపించారని, వాటికి సరైన తీర్మానాలు కానీ బోర్డు ఆమోదాలు కానీ లేవని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రవిప్రకాష్ కు టీవీ 9 కోత్త యాజమాన్యానికి మధ్య వార్ నడుస్తోంది. ఇటీవలే నటుడు, రవిప్రకాష్ సన్నిహితుడు శివాజీ మళ్లీ ఓ విడియో వదిలారు. మెగా కృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. త్వరలో సాక్ష్యాధారాలతో ఆయన మీద పోరు స్టార్ట్ చేస్తానని ప్రకటించారు. 

ఇలాంటి నేపథ్యంలో రవిప్రకాష్ అరెస్ట్ జరగడం చర్చనీయాంశంగా వుంది. శనివారం అరెస్ట్ చేస్తే, బెయిల్ రావడం కష్టం కావచ్చు. ఆదివారం, ఆ తరువాత కోర్టుకు దసరా సెలవులు. ఏం జరుగుతుందో చూడాలి.