Advertisement

Advertisement


Home > Politics - Gossip

రవిప్రకాష్ మాస్టర్ ప్లాన్ అదేనా?

రవిప్రకాష్ మాస్టర్ ప్లాన్ అదేనా?

టీవీ మాధ్యమంలో తనకంటూ ఓ ముద్రవేసుకున్న రవిప్రకాష్ మళ్లీ తన పూర్వ వైభవం సంతరించుకోవడానికి ఏం చేయబోతున్నారు? ఏదో ఒకటి చేయబోతున్నారని ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

టీవీ 9 నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన మరో ఛానెల్ పెడతారని వినిపిస్తూనే వుంది. కానీ ఏదో రకమైన సమస్యలు చుట్టుముట్టి, అలా వెనక్కి వెనక్కు వెళ్తోంది వ్యవహారం.

ఇటీవలే ఐ న్యూస్ చానెల్ ను టేకోవర్ చేసే ఆలోచనలు, ప్రయత్నాలు జరిగాయని బోగట్టా. అయితే ఒక్క సిటింగ్ అయిన తరువాత ఏమయిందో, ఆ ప్రయత్నం ఆగిపోయింది. ప్రస్తుతానికి ఓ ఆఫీస్ అయితే అరోరా కాలనీలో తీసారని, కొంతమంది పని చేస్తున్నారని వినిపిస్తోంది.

ఇదిలా వుంటే రవిప్రకాష్ ఓ మాస్టర్ ప్లాన్ లో వున్నారని, ప్రస్తుతం చుట్టూ వున్న లీగల్ సమస్యలు ఓ కొలిక్కి రాగానే అది అమలులో పెడతారని వినిపిస్తోంది. అదేంటంటే, తెలంగాణ, ఆంధ్ర నుంచి కాకుండా తమిళనాడు నుంచి తెలుగు ఛానెల్ ను రన్ చేయడం.

డిజిటల్ యుగంలో ఏది ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. అందువల్ల తమిళనాట నుంచి ప్రసారాలు చేయడం, అక్కడే అన్ని కార్యకలాపాలు నిర్వహించడం అన్న ఆలోచనలు సాగుతున్నాయని జర్నలిస్ట్ వర్గాల బోగట్టా.

చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఎవరో గతంలో తమిళనాట తెలుగు చానెల్ పెట్టి, అంతగా రన్ చేయకుండా వదిలేసారని, దాన్ని టేకోవర్ చేసి, అక్కడి నుంచే రన్ చేస్తారని వదంతులు వినిపిస్తున్నాయి.

ఎక్కడి నుంచి అయినా, ఎలాగ అయినా జనవరి తరువాత రవిప్రకాష్ జర్నలిస్ట్ కార్యకలాపాలు అయితే ప్రారంభం అవుతాయని వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?