Advertisement

Advertisement


Home > Politics - Gossip

రేవంత్‌ చుట్టూ ద‌ళారులు రెడీ!

రేవంత్‌ చుట్టూ ద‌ళారులు రెడీ!

తెలంగాణ కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి చుట్టూ అప్పుడే రాజ‌కీయ ద‌ళారులు చేరుతున్నారు. రేవంత్‌తో గ‌తంలో త‌మ అనుబంధాన్ని గుర్తు చేస్తూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని, హైద‌రాబాద్‌లో ల‌బ్ధి పొంద‌డానికి ఇత‌ర పార్టీల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో రేవంత్‌ను ఏపీకి చెందిన ఇత‌ర పార్టీల నేత‌లు క‌లిసి శుభాకాంక్ష‌లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా ఏపీకి చెందిన టీడీపీ, అలాగే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేత‌లు రేవంత్‌పై ప్రేమాభిమానాలు ఒల‌క‌బోస్తున్నారు. అధికారం ఎక్క‌డుంటే అక్క‌డ వాలిపోయే ఇలాంటి నేత‌ల మాయలో ప‌డితే రేవంత్‌రెడ్డికి న‌ష్టం జ‌ర‌గ‌డం ఖాయం. తెలంగాణ‌లో కాంగ్రెస్‌కున్న బ‌ల‌గాన్ని ప‌దేప‌దే గుర్తెరిగి రేవంత్‌రెడ్డి జాగ్ర‌త్త‌గా మెల‌గాల్సిన స‌మ‌యం ఇది.

హైద‌రాబాద్‌లో వ్యాపారాలు, వేల కోట్ల ఆస్తులు క‌లిగిన ఏపీకి చెందిన వివిధ పార్టీల నేత‌లు అప్పుడే రేవంత్‌రెడ్డి గుడ్ లుక్స్‌లో ప‌డ‌డానికి శ్ర‌మిస్తున్నారు. రేవంత్‌తో త‌మ‌కు గాఢ‌మైన బంధం వుంద‌నే సంకేతాలు పంప‌డానికి ఎల్లో మీడియాను వాడుకుంటు న్నారు. ఈ జిమ్మిక్కుల‌న్నీ త‌మ వ్యాపారాల‌ను వృద్ధి చేసుకోడానికి , ఆస్తుల్ని కాపాడుకోడానికే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

సీఎంగా రేవంత్‌రెడ్డి ఇష్టానుసారం నిర్ణ‌యాలు తీసుకోడానికి వుండ‌దు. ఎందుకంటే ఆయ‌న‌కు హైక‌మాండ్ ఢిల్లీలో వుంటుంది. కాంగ్రెస్‌లో మంత్రుల‌కు స్వ‌తంత్ర‌త వుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు లాంటి వాళ్లు మంత్రులైతే, వాళ్ల‌పై రేవంత్‌రెడ్డి పెత్తనం చెలాయించే ప‌రిస్థితి వుండ‌దు.

పాత సంబంధాల రీత్యా ఏపీకి చెందిన టీడీపీ, అలాగే బీజేపీలో వుంటున్న మిత్రుల కోసం రేవంత్‌రెడ్డి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది. అలాగ‌ని త‌నకు బాగా కావాల్సిన వాళ్లకు సీఎంగా ఉండి చేయ‌లేక‌పోవ‌డం ఏంట‌నే అహానికి వెళితే, ఏమ‌వుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కావున ఎవ‌రి కోసం రాజ‌కీయంగా న‌ష్ట‌పోవ‌డానికి రేవంత్‌రెడ్డి సిద్ధంగా లేర‌నే టాక్ వినిపిస్తోంది. కానీ ఆయ‌న్ను వాడుకోడానికి మాత్రం పొలిటిక‌ల్ ద‌ళారులు మాత్రం త‌మ ప్ర‌య‌త్నాల్ని సాగిస్తూనే వుంటారు. ఇప్ప‌టికే అది ప్రారంభ‌మైంది. రానున్న రోజుల్లో ఏమ‌వుతుందో చూద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?