Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆర్‌కేకు క‌రోనా కంటే పెద్ద రోగ‌మే రావాలి!

ఆర్‌కేకు క‌రోనా కంటే పెద్ద రోగ‌మే రావాలి!

ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విలేక‌రుల స‌మావేశంలో ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌కు చేసిన‌ హెచ్చ‌రిక బాగా ప‌ని చేసిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. దేవునికైనా దెబ్బే గురువు అన్న‌ట్టు...అస‌లే కేసీఆర్ ఖ‌త‌ర్నాక్ అని, ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని రాత‌లు రాయాల‌ని హెచ్చ‌రించిన‌ప్ప‌టి నుంచి ఆ ప‌త్రిక "పాహిమాం" అని కాళ్ల‌బేరానికి పోయిందా అంటే... అవున‌నే సమాధానం వ‌స్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నం సోమ‌వారం ఆంధ్రా ఎడిష‌న్‌లో ప‌తాక శీర్షిక‌తో రాసిన ఓ క‌థ‌న‌మే ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు.

"క‌రోనా లెక్క త‌ప్పుతోంది" శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతిలో బ్యాన‌ర్ క‌థ‌నం రాశారు. వైద్యుల‌కు ర‌క్ష‌ణేది అనే శీర్షిక‌తో ఇటీవ‌ల తెలంగాణ ఎడిష‌న్‌లో క‌థ‌నం రాసి...ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో తిట్లు తిన్నారు. ఆ తిట్ల ఎఫెక్ట్ బాగా ప‌ని చేసిన‌ట్టే ఉంది. అందుకే ఆంధ్రా ఎడిష‌న్‌లో ఈ వేళ రాసిన క‌థ‌నంలో క‌రోనా లెక్క‌ల‌పై పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో వాస్తవాలు బయటకు వెల్లడిస్తుండగా, ఆంధ్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని సమాచారం అని రాసుకొచ్చారు.

అంతేకాదు, "వైరస్‌ అనుమానితులకు చేస్తున్న వైద్య పరీక్షలపైనా పూర్తి నిజాలు చెప్పకుండా దాస్తోందా? మృతుల లెక్కలను సైతం సాధారణ మరణాల ఖాతాలో వేస్తోందా? కేంద్రం ఈ దిశగానే అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది"... ఇదీ ఆంధ్ర‌జ్యోతి మార్క్ రాత‌లు. మ‌ర‌ణాల లెక్క‌ల‌ను మార్చి రాయ‌డం ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఎందుకంటే మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే రాజ‌ధాని ప్రాంతంలో ఎలాంటి మ‌ర‌ణాన్ని అయినా రాజ‌ధాని ఖాతాలో వేసిన ఘ‌న‌త ఒక్క ఎల్లో మీడియాకే ద‌క్కింది. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌ని రైతులు ప్రాణ‌త్యాగం చేస్తున్నారంటూ...అనారోగ్యంతోనే, గుండె జ‌బ్బుతోనే చ‌నిపోయిన వారిని కూడా రాజ‌ధాని మ‌ర‌ణాల జాబితాలో చేర్చిన ఘ‌న‌త ఎల్లో మీడియాకే ద‌క్కింది.

బ‌హుశా ఆ దృష్టితో క‌రోనాను చూస్తుండ‌టం వ‌ల్ల క‌రోనా లెక్క‌ల్లో ఆర్‌కేకు తేడాలు క‌నిపిస్తున్న‌ట్టుంది!

"క‌రోనా లెక్క‌ల‌ను నిగ్గు తేల్చేందుకు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రంలో దిగాయి. ఏం జరుగుతోందో కూపీ లాగడం మొదలుపెట్టాయి. మొదటి కరోనా కేసు నుంచి 18న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 603వ కేసు వరకూ ఏ రోజు ఎలా పెరిగింది? ఏ రకంగా సంఖ్య తగ్గింది? ఏ జిల్లాలో ఎలా ఉంది? ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాల్లో ఒక్కటి కూడా నమోదు కాకపోవడానికి కారణమేంటి? తదితరాలపై ఆరాతీశాయిష‌...ఏపీలో మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన‌ప్పుడు కూడా కేంద్ర నిఘా సంస్థ రంగంలోకి దిగిందంటూ ఆంధ్ర‌జ్యోతిలో రాశారు. మ‌రి అంత ప‌నిలేకుండా కేంద్ర నిఘా సంస్థ ఉందా?

ఆంధ్ర‌జ్యోతిలో ఈ రాత‌ల‌ను చ‌దివిన త‌ర్వాత ఒక్క విష‌యం మాత్రం నిర్ధార‌ణైంది. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీలో క‌రోనా లెక్క‌లు తేల్చే నిఘా అధికారిగా ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌ను నియ‌మించిన‌ట్టు స‌మాచారం. ఆర్‌కే త‌న విస్తృత‌మైన నెట్‌వ‌ర్క్‌తో ఫుట్ వ‌ర్క్ చేసి నిజాలు నిగ్గు తేల్చుతాడ‌ని కేంద్ర ప్ర‌భుత్వం యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఆర్‌కేను నియ‌మించిన‌ట్టు నిఘా వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తోంది. త‌న టీంలోకి నారా లోకేశ్‌ను కూడా తీసుకున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని స‌మ‌న్వ‌య‌ప‌రిచే అధికారిగా చంద్ర‌బాబును మోడీ నియ‌మించిన‌ట్టు కూడా బీజేపీ ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

షూటూ, బూటూ వేసుకుని క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ చేస్తే త‌న‌ను గుర్తు ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ఆర్‌కే వ్యూహం మార్చిన‌ట్టు తెలుస్తోంది. ఆర్‌కే దిగంబ‌రంగా తిరుగుతుండ‌టంతో పోలీసులు, జ‌నాలు ప‌సిగ‌ట్ట‌లేక పోయార‌ని స‌మాచారం. అంతేకాదు, ఆర్‌కేను పిచ్చివాడిగా అంద‌రూ భావిస్తున్నార‌ని తెలిసింది. త‌న‌ను పిచ్చివాడిగా చూస్తున్న జ‌నం అజ్ఞానానికి దిగంబ‌రుడైన ఆర్‌కే లోలోన న‌వ్వుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. త‌న‌లో ఇంత అద్భుత‌మైన న‌టుడు ఉన్నాడ‌నే విష‌యం తెలియ‌క చాలా ఘోరం జ‌రిగిపోయింద‌ని ఒక ద‌శ‌లో ఆర్‌కే తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన‌ట్టు టీంలో క్రియాశీల‌క స‌భ్యుడైన లోకేశ్ త‌న స‌న్నిహితుల‌తో అన్న‌ట్టు తెలిసింది.

తెలంగాణ‌లో ప్ర‌తి హెల్త్ బులెటిన్‌కు క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయ‌ని, ఆంధ్రా విష‌యంలో ఎందుకు పెర‌గ‌డం లేద‌ని ఆంధ్ర‌జ్యోతి ప్ర‌శ్నిస్తోంది, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఆంధ్రాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించి స‌ర్వ‌నాశ‌నం కావాల‌ని ఆర్‌కే బ‌లంగా కోరుకుంటున్నాడనేందుకు ఇంత కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి? అలా కాక‌పోతే ఏమిటీ రాత‌లు? క‌డుపుకు కూడు తినేవాళ్లెవ‌రైనా ఇలాంటి ప‌నికిమాలిన రాత‌లు రాస్తారా?

ఎంత‌సేపూ క‌రోనా వ్యాప్తికి ముస్లింలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని, వాళ్ల‌పై జ‌నంలో ద్వేష భావ‌న పెంచాల‌ని ఆర్‌కే ప‌డుతున్న శ్ర‌మ అంతాఇంతా కాదు. అందుకే ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల వ‌ల్లే అంటూ క‌ర్నూలు, గుంటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఆంధ్ర‌జ్యోతి తెర‌మీద‌కు తేవ‌డం. తెలంగాణ‌లో ఒక రోజు ఇలాంటి ప‌నికి మాలిన క‌థ‌నం రాస్తే...కేసీఆర్ క‌రోనా రావాల‌ని శపించారు. కేసీఆర్ శాపంపై గ‌త వారం కొత్త ప‌లుకులో ఆర్‌కే ఏమ‌న్నారో చూడండి...

"నాకు క‌రోనా వైర‌స్ సోకాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ‌పించారు. అయితే ఆయ‌న కంటే అత్యంత శ‌క్తిమంతుడైన దేవుడి ద‌య‌వ‌ల్ల నేను ఇప్ప‌టి వ‌రకు క్షేమంగానే ఉన్నాను. అయినా మ‌హమ్మారి క‌రోనా బారి నుంచి ప్ర‌జ‌లంద‌రినీ ర‌క్షించాల్సిన ముఖ్య‌మంత్రి ఫ‌లానా వారికి క‌రోనా వైర‌స్ సోకాల‌ని శ‌పించడం ఏంటి? హ‌ద్దులు లేని అస‌హ‌నానికి ఇది నిద‌ర్శ‌నం కాదా? ఇంత‌కీ శాపం పెట్ట‌వ‌ల‌సినంత త‌ప్పు నేను గానీ, ఆంధ్ర‌జ్యోతి గాని ఏమి చేసిన‌ట్టు? " అని ఆర్‌కే ప్ర‌శ్నించాడు.

ప్ర‌తిరోజూ ప‌నిగ‌ట్టుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేయ‌డానికి ఏదో ఒక త‌ప్పుడు క‌థ‌నాన్ని రాస్తుండ‌టం నిజం కాదా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ఆర్‌కే చేస్తున్న ద్రోహం అంతాఇంతా కాదు. ఆర్‌కేకు క‌రోనా కంటే పెద్ద జ‌బ్బు ఏదైనా ఉంటే అది త‌గులుకోవాల‌ని శ‌పించినా త‌ప్పు కాదు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఆర్‌కేలో హ‌ద్దులు లేని అస‌హ‌నానికి ఆంధ్ర‌జ్యోతిలో వ‌స్తున్న త‌ప్పుడు క‌థ‌నాలే నిద‌ర్శ‌నం.

ఇంత‌కీ శాపం పెట్ట‌వ‌ల‌సినంత త‌ప్పు నేను గానీ, ఆంధ్ర‌జ్యోతి గాని ఏమి చేసిన‌ట్టు? అని కేసీఆర్‌ను ఆర్‌కే ప్ర‌శ్నించాడు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రా ప్ర‌జ‌ల త‌ర‌పున ఓ ప్ర‌శ్న‌...ఇంత‌కీ వ‌రాలు కురిపించ‌డానికి ఆంధ్ర‌జ్యోతి లేదా ఆర్‌కే చేస్తున్న ఒక్క మంచి ప‌నైనా ఉందా?  నిరాధార‌మైన క‌థ‌నాల‌ను నిర్ల‌జ్జ‌గా వండివార్చ‌డం ఒక్క ఆర్‌కేకు మాత్రమే సాధ్యం. ఇలాంటి రాత‌లు రాసినోళ్ల‌కు క‌రోనా కంటే పెద్ద రోగ‌మే రావాలని శ‌పిస్తే త‌ప్పేంటి?

-సొదుం

తెలంగాణాలో మే 7 వరకు చాలా కఠినంగా లాక్ డౌన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?