Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప‌ల‌మ‌నేరు వైసీపీ అభ్య‌ర్థిగా అత‌నేనా?

ప‌ల‌మ‌నేరు వైసీపీ అభ్య‌ర్థిగా అత‌నేనా?

స‌ర్వేల్లో వ్య‌తిరేకంగా వుంద‌ని తేలితే సిట్టింగ్‌ల‌ను సైతం ప‌క్క‌న పెట్ట‌డానికి సీఎం వైఎస్ జ‌గ‌న్ వెనుకాడ‌డం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాలో న‌లుగురైదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు సీట్లు ద‌క్క‌వ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ‌నివాస్‌ను ప‌క్క‌న పెట్టి విజ‌యానంద‌రెడ్డికి ప్ర‌క‌టించారు. అలాగే పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు త‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే వెంక‌టేశ్ గౌడ్‌ను కూడా ప‌క్క‌న పెట్టి, మ‌రో అభ్య‌ర్థిని రెడీ చేసుకున్నార‌ని స‌మాచారం. టికెట్ ఇస్తామ‌నే హామీతో ఇటీవ‌ల టీడీపీ నాయ‌కుడు ఆర్‌వీ సుభాష్‌చంద్ర‌బోస్‌ను సీఎం స‌మ‌క్షంలో వైసీపీలో చేర్చుకున్నార‌నే టాక్ న‌డుస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ఆర్‌వీ సుభాష్ పోటీ చేసి ఓడిపోయారు.

తాజాగా ప‌ల‌మ‌నేరు టీడీపీ టికెట్ ఆయ‌న‌కు ద‌క్కే అవకాశాలు లేవు. మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డిని కాద‌ని త‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌ని గ్ర‌హించిన సుభాష్ ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించారు. చిత్తూరు వైసీపీకి పెద్ద దిక్కు అయిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో ఆయ‌న ట‌చ్‌లోకి వెళ్లార‌ని తెలిసింది. 

ప‌ల‌మ‌నేరు టికెట్ హామీతోనే వైసీపీ కండువా క‌ప్పుకున్న‌ట్టు చిత్తూరు జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌ల‌మ‌నేరు వైసీపీ అభ్య‌ర్థిగా బోస్ బ‌రిలో దిగ‌నున్నార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?