సబ్బం ‘నాన్ లోకల్ ‘ కాల్

కాంగ్రెస్ నుంచి జగన్  దగ్గరకు అక్కడ నుంచి తేదేపాకు అటు ఇటు తిరిగిన విశాఖ లోకల్ లీడర్ సబ్బం హరికి ఉన్నట్లుండి లోకల్ ఫీలింగ్ పట్టుకుంది. ఆయన వేరే ఊరు నుంచి నుంచి విశాఖకు…

కాంగ్రెస్ నుంచి జగన్  దగ్గరకు అక్కడ నుంచి తేదేపాకు అటు ఇటు తిరిగిన విశాఖ లోకల్ లీడర్ సబ్బం హరికి ఉన్నట్లుండి లోకల్ ఫీలింగ్ పట్టుకుంది. ఆయన వేరే ఊరు నుంచి నుంచి విశాఖకు వచ్చినా నాన్ లోకల్ కాదు. విశాఖ నుంచి అనకాపల్లికి పోటీకి వెళ్లినా నాన్ లోకల్ కాదు. 

అక్కడి నుంచి మళ్లీ షిఫ్ట్ అయినా నాన్ లోకల్ కాదు. ఎందుకంటే ఆయనది విశాఖ జిల్లానే కనుక.  అందుకే ఇప్పుడు ఒక్కసారిగా  లోకల్ లోకల్ అంటూ గొంతు చించుకుంటున్నారు. కోట్లు ఖర్చు చేసి పోలింగ్ రోజు ప్రధాన దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు.

సుబ్బరామిరెడ్డి, ఎమ్ వి వి ఎస్ మూర్తి, పురంధ్రీశ్వరి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్ వి వి సత్యానారాయణ, ఇలా చాలా మంది వున్నపుడు కానీ, జెడి లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్, భరత్ పోటీ చేసినపుడు కానీ లోకల్ నాన్ లోకల్ గుర్తుకు రాలేదు. 

కేవలం వైకాపా అనే సరికి లోకల్ నాన్ లోకల్ గుర్తుకువస్తుంది తెలుగుదేశం జనాలకు. కానీ ఆ పార్టీ విశాఖ మొత్తం నాన్ లోకల్స్ చేతిలోనే వుంది కనుక ఆ మాట అనలేదు. అలా అనిపించడానికి దొరికిన తురుపు ముక్క సబ్బం హరి. గతంలో విజయలక్ష్మి పోటీ చేసినపుడు ఇదే స్ట్రాటజీ వాడారు. 

కడప గూండాలు, ఫ్యాక్షనిజం అంటూ. మళ్లీ అదే రాగం అందుకున్నారు. భవిష్యత్ లో తాను ఏ పార్టీలో వున్నా ఇదే స్టాండ్ తో వుంటా. ఇలాగే నిలదీస్తా అని సబ్బం హరి చెప్పగలరా? 

విశాఖను దశాబ్దాల కాలంగా తమ గుప్పిట్లో పెట్టుకుని వ్యాపారాలు, రాజకీయాలు అన్నీ తమ కనుసన్నలలో వుంచుకున్న సామాజిక వర్గం, ఇప్పుడు విశాఖ మీద తమ పట్టు ఎక్కడ జారిపోతుందో అని  వెనుక వుండి ఆడిస్తున్న డ్రామా ఇదంతా అని జనం గమనిస్తూనే వున్నారు. 

కానీ తెలియాల్సి ఏమిటంటే నాన్ లోకల్స్, లోకల్స్ అనే వారిలో ఆ సామాజిక వర్గం గత దశాబ్దాల కాలంగా విశాఖను ఎలా గుప్పిట్లో వుంచుకుందో క్లారిటీగా తెలిసిన వారు వున్నారు. బహుశా వారు సబ్బం హరి ద్వారా ఆ వర్గం ఆడిస్తున్న డ్రామాను గమనించే వుంటారు. 

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..

గాలి సంపత్.. F2 లాంటి కామెడీ సినిమా కాదు