Advertisement

Advertisement


Home > Politics - Gossip

స‌త్య‌వేడు వైసీపీ అభ్య‌ర్థిగా ఐఏఎస్ అధికారి!

స‌త్య‌వేడు వైసీపీ అభ్య‌ర్థిగా ఐఏఎస్ అధికారి!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు వైసీపీ అభ్య‌ర్థిగా ఐఏఎస్ అధికారిని నిల‌బెట్టే ఆలోచ‌న‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం. అభ్య‌ర్థుల ఎంపిక‌పై సీఎం జ‌గ‌న్ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ ద‌ఫా ఒక నెల ముందుగానే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. మార్చి మొద‌టి లేదా రెండో వారంలో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే ఉద్దేశంతో అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను జ‌గ‌న్ వేగ‌వంతం చేశారు.

ఈ క్ర‌మంలో తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలాన్ని మార్చ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు వైసీపీ పెద్ద‌లు స‌మాచారం ఇచ్చారు. ప్ర‌త్యామ్నాయంగా నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తామ‌ని ఆయ‌న‌కు చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ఆయ‌న తీవ్ర అసంతృప్తిగా ఉన్నార‌ని స‌మాచారం. ఆదిమూలం భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది తెలియాల్సి వుంది.

మరోవైపు స‌త్య‌వేడులో బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు జ‌గ‌న్ ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం దేవాదాయ‌శాఖ‌లో కీల‌క ప‌ద‌విలో ఉన్న ఐఏఎస్ అధికారిని అక్క‌డ నిలిపేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. బ‌హుశా త్వ‌ర‌లోనే ఆ ఐఏఎస్ అధికారి పేరును ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి.

వైసీపీ నిల‌బెట్టాల‌ని అనుకుంటున్న ఆ అభ్య‌ర్థి ప్ర‌స్తుతం టీటీడీలో ఎక్స్ అఫీషియో స‌భ్యుడిగా ఉన్నారు. జ‌గ‌న్ అధికారికంగా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన త‌ర్వాత‌, స‌ద‌రు ఐఏఎస్ అధికారి రంగంలో దిగ‌నున్నార‌ని తెలిసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?