Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైసీపీలోకి సీనియ‌ర్ హీరోయిన్‌!

వైసీపీలోకి సీనియ‌ర్ హీరోయిన్‌!

వైసీపీలోకి సీనియ‌ర్ హీరోయిన్ ర‌వ‌ళి వెళ్తార‌నే ప్ర‌చారానికి తెర‌లేచింది. ఇవాళ మంత్రి ఆర్కే రోజా వెంట ఆమె వుండ‌డంతో ప‌లు ఊహాగానాల‌కు ఆస్కారం ఇచ్చిన‌ట్టైంది. 

ఆర్కే రోజా... ఒక‌ప్పుడు సీనియ‌ర్ హీరోయిన్‌. ప్ర‌స్తుతం అధికార పార్టీలో సీనియ‌ర్ లీడ‌ర్‌. జ‌గ‌న్ రెండో కేబినెట్‌లో బెర్త్ ద‌క్కించుకున్న నాయ‌కురాలు. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న త‌ర్వాత ఆమె జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోకి గుడ్ బై చెప్పారు. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం ఆమెకు సినీ ప‌రిశ్ర‌మ‌తో బంధం బ‌ల‌ప‌డేలా చేసింది.

ఈ నేప‌థ్యంలో రోజా వెంట సీనియ‌ర్ హీరోయిన్ ర‌వ‌ళి ఉండ‌డం ప‌లు ర‌కాల ప్ర‌చారానికి తెర‌లేచింది. తిరుమ‌ల శ్రీ‌వారిని గురువారం వీఐపీ ద‌ర్శ‌న స‌మ‌యంలో రోజా, ర‌వ‌ళి ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

ఇటీవ‌ల సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఆస‌క్తిక‌న‌బ‌రుస్తున్నారు. ఇందులో భాగంగా త‌న స్నేహితురాలు రోజా సిఫార్పుతో వైసీపీలో చేరేందుకు ర‌వ‌ళి ప్ర‌య‌త్నిస్తున్నారా? అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.  

న‌టి దివ్య‌వాణి టీడీపీలో యాక్టీవ్ రోల్ పోషించారు. ఇటీవ‌లే ఆమె టీడీపీ నుంచి బ‌య‌టికొచ్చారు. అనంత‌రం ఆ పార్టీపై దివ్య‌వాణి ఘాటు వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే వారికి టీడీపీలో స్థానం లేద‌ని ఆమె వాపోయారు. వైఎస్ జ‌గ‌న్‌పై ఆమె ప్ర‌శంస‌లు కురిపించారు.

కేవ‌లం త‌న క్రిస్టియన్ మ‌తాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీకి కోవ‌ర్ట్‌గా ముద్ర వేయ‌డం బాధ మిగిల్చింద‌ని ఆమె వాపోయిన సంగ‌తి తెలిసిందే. వైసీపీలో దివ్య‌వాణి చేరుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

తాజాగా రోజా వెంట ర‌వ‌ళి క‌నిపించ‌డంతో ఆమె రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టనున్నారా? అనే అభిప్రాయానికి దారి తీసింది. రాజ‌కీయ ప్ర‌వేశంపై ర‌వ‌ళీనే మ‌న‌సులో మాట చెప్పాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?