Advertisement

Advertisement


Home > Politics - Gossip

టీడీపీ ఎలా ఓడిందో చంద్రబాబుకి తెలియదట.!

టీడీపీ ఎలా ఓడిందో చంద్రబాబుకి తెలియదట.!

ఎన్నికల్లో గెలుపోటములు చంద్రబాబుకి కొత్తేమీకాదు. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు అదే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నారు. ఓటమి వచ్చినప్పుడు, ఫలితాల్ని విశ్లేషించుకుని ముందడుగు వేయడం నాయకుడి లక్షణం. కానీ, అదే నాయకుడు 'ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదు' అని చేతులెత్తేస్తే క్యాడర్‌కి తమ దారి తాము చూసుకోవడం తప్ప వేరే ఛాన్స్‌ వుండదు.

చంద్రబాబు తీరు, తెలుగుదేశం పార్టీని ముంచేసేలానే వుంది. 'ఓడిపోయిన ప్రతిసారీ ఏదో ఒక కారణం కన్పించింది.. కానీ, ఇప్పుడు కారణం దొరకడంలేదు..' అంటూ చంద్రబాబు పార్టీ ముఖ్యనేతల సమావేశంలో తాజాగా 'నిర్వేదం' చూపారు. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయోగానీ, తెలుగుదేశం పార్టీ ఓటమికి మాత్రం అంతకన్నా ఎక్కువే కారణాలున్నాయి. అన్నిట్లోకీ అతి ముఖ్యమైన కారణం అవినీతి. పోనీ, అవినీతిని జనం పట్టించుకోలేదా.? అంటే, అసమర్థత పాలన మరో కారణంగా కన్పిస్తుంది. ఇవేవీ కాదనుకున్నా.. గత ఐదేళ్ళలో టీడీపీ అరాచక పాలన కళ్ళ ముందు కదలాడుతుంది.

పార్టీ ఫిరాయింపులు కావొచ్చు, మహిళలపై టీడీపీ నేతల దాడులు కావొచ్చు.. దళితులపై టీడీపీ దౌర్జన్యాలు కావొచ్చు.. ఒకటేమిటి.? కుప్పలు తెప్పలుగా కారణాలున్నాయి టీడీపీ ఓటమికి. కానీ, చంద్రబాబుకి ఆ కారణాలేవీ అసలు కారణాలుగానే కన్పించవు. అదే అసలు సమస్య. కుమారుడ్ని ప్రజామోదంతో చట్ట సభలకు పంపించాల్సింది పోయి, నామినేటెడ్‌ కోటాలో చట్టసభకు చంద్రబాబు పంపినప్పుడే, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తేంటన్న దానిపై అందరికీ ఓ అవగాహన వచ్చేసింది.

'ఇప్పుడు కాకపోతే, నా కుమారుడ్ని ఇంకోసారి మంత్రిగా చూసుకునేందుకు అవకాశం రాదు' అని చంద్రబాబు అప్పట్లోనే ఫిక్సయిపోయారు. అదే జరిగిందిప్పుడు. ఇందులో, చంద్రబాబు అర్థం చేసుకోలేనంత 'సీక్రెట్‌' టీడీపీలో ఏముందని.? 'ఓటమికి కారణాలు తెలుసుకోండి.. విశ్లేషించండి..' అని చంద్రబాబు, పార్టీ నేతలకు సూచన చేశారట. నవ్విపోదురుగాక.. మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం. అసెంబ్లీలో స్పీకర్‌ ఎంపిక సందర్భంగా చంద్రబాబు వ్యవహరించిన తీరుతోనే అర్థమయిపోయింది.. చంద్రబాబు మారలేదని. ఆయన మారరు, టీడీపీ ఇకపై ఆయన సారధ్యంలో బాగుపడదు కూడా.! 

పవనమా? ఋతుపవనమా? ఈ పవనమెటు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?