
తెలుగుదేశం-జనసేనల పొత్తు దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో.. ఈ విషయానికి ఒకటి పది సార్లు స్వయంగా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో.. సొంతంగా పోటీ చేసే శక్తి లేదూ, సీఎం సీటును ఆశించే తాహతూ లేదని పవన్ కల్యాణ్ తన గురించి తన పార్టీ గురించి క్లారిటీ ఇచ్చిన పరిణామాల మధ్యన.. టీడీపీ-జనసేన ల పొత్తు సీట్ల లెక్కల్లో ఎలా పొడుస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం.
తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోలేకపోయాడు పవన్ కల్యాణ్. టీడీపీ-జనసేల పొత్తులో తను సీఎం అభ్యర్థి అయ్యే ఛాన్సు లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. చంద్రబాబు పల్లకి మోయడమే తప్ప పవన్ కల్యాణ్ తనకు తాను ఎలాంటి చాయిస్ ను ఎంచుకోలేకపోయాడు.
మరి సీఎం సీటు పోయింది.. ఇక జనసేనకు చంద్రబాబు నాయుడు ఎన్ని అసెంబ్లీ టికెట్లను కేటాయిస్తారనేది తదుపరి కథ. పవన్ కల్యాణ్ తీరును గమనిస్తే.. ఆయన ఇప్పుడు డిమాండ్ చేసే ఉద్ధేశంతో కానీ, డిమాండ్ చేసే ఆసక్తితో కానీ లేడని స్పష్టం అవుతోంది. పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ.. తెలుగుదేశం తో పొత్తు అని స్పష్టం చేస్తూ.. పవన్ కల్యాణ్ తన స్థాయిని తనే చాలా వరకూ తగ్గించేసుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముష్టిగా ఎన్ని సీట్లను ఇచ్చినా తీసుకోక తప్పదు జనసేన. పవన్ కల్యాణే ఈ విషయంలో జనసేనను లాక్ చేసేశాడు.
చంద్రబాబు ఇచ్చినన్ని సీట్లను తీసుకోవడమే తప్ప జనసేనకు మరో మార్గం లేదు. ఈ విషయంలో పవన్ కు కూడా ఎలాంటి బాధా లేదు కూడా! తక్కువ సీట్లను ఇచ్చారని పొత్తుకు నో అనేంత పరిస్థితి ఇక పవన్ లేదు. ఇచ్చినన్ని సీట్లను తీసుకోవడమే అంతకు మించిన మార్గమూ లేదు. దీంతో ఇప్పుడు జనసేనకు టీడీపీ ఎన్ని అసెంబ్లీ టికెట్లను కేటాయిస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం.
తెలుగుదేశం నేతల మాటలను బట్టి చూస్తే.. జనసేనతో టీడీపీ బేరం ఏడు సీట్లతో మొదలుకావొచ్చని అర్థం అవుతోంది. అది కూడా గత ఎన్నికల్లో జనసేన చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను సాధించిన నియోజకవర్గాలు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు అప్పుడు 40 వేల ఓట్లు దక్కాయి.
కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ, జనసేనలు కలిసి పోటీ చేసిన ఆ ఎన్నికల్లో జనసేనకు 40 వేలకు మించిన ఓట్లు దక్కింది ఏడు నియోజకవర్గాల్లో. వాటిల్లో పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం ఉన్నాయి. ఈ రెండూ గాక మరో ఐదు నియోకవర్గాలను అది కూడా 40 వేల స్థాయి ఓట్లను పొందిన నియోజకవర్గాలను జనసేనకు టీడీపీ కేటాయించే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
ఇలా ఏడు సీట్లతో జనసేనతో టీడీపీ బేరం మొదలుకావొచ్చని తెలుస్తోంది. మరి ఏడు సీట్ల బేరాన్ని జనసేన ఎంత వరకూ పెంచుకోగలదనేది కూడా సందేహమే. ఎందుకంటే.. చంద్రబాబు పల్లకి మోయడానిక ఇప్పటికే పవన్ ఫిక్సయ్యాడు. మధ్యలో వదిలే అవకాశాలు లేవు. కాబట్టి.. టీడీపీ కేటాయించిన సీట్లను తీసుకోవడమే తప్ప మరో ఛాయిస్ లేదు జనసేనకు!
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా