Advertisement

Advertisement


Home > Politics - Gossip

తెలంగాణలో అలా..ఆంధ్రలో ఇలా

తెలంగాణలో అలా..ఆంధ్రలో ఇలా

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో చిత్రమైన వ్యవహారం నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో లాక్ డౌన్. ఆంధ్రలో కేవలం కర్ఫ్యూ. తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఆంధ్ర జనాలు రావడానికి చెక్ పోస్ట్. తనిఖీలు. కానీ అదే సరిహద్దులో ఆంధ్రలోకి రావడానికి ఏ అడ్డంకులు లేవు. చెకింగ్ లు లేవు. 

తెలంగాణలో ఈపాస్ వ్యవహారం లేదు కానీ ఆంధ్రలో ఈపాస్ వ్యవహారం వుంది. కానీ తెలంగాణ సరిహద్దు నుంచి ఆంధ్ర నడిబొడ్డు వరకు దాన్ని అడిగేవారు లేరు. ఈపాస్ అంటూ సవాలక్ష రూల్స్ పెట్టి పాస్ లు ఇస్తూ, వాటిని పట్టించుకోకుండా జనాలను యధేచ్ఛగా వదిలేయడం అంటే ఏమనుకోవాలి?

ఆంధ్రలో కర్ఫ్యూ వుంది కానీ జనాల రాకపోకలకు అడ్డంకులు లేవు. దుకాణాలు మాత్రమే బంద్. ఎక్కడి పనులు అక్కడ జరుగుతూనే వున్నాయి. తెలంగాణలో మాత్రం ఉదయం పది అయితే అంతా బంద్. రోడ్లు నిర్మానుష్యం.

తెలంగాణ లో తక్కువ కేసుల నమోదు. ఆంధ్రలో ఎక్కువ కేసుల నమోదు.  లాక్ డౌన్ అవసరం లేదన్న కేసిఆర్ ఆఖరికి దానికే మొగ్గు చూపారు. కర్ఫ్యూ ముందే పెట్టిన జగన్ లాక్ డౌన్ గురించి మాట్లాడడం లేదు. 

ఇదంతా చూస్తుంటే ఆంధ్రలో కాస్త కట్టుదిట్టం చేస్తున్నాం అన్న కలర్ ఇస్తున్నారా? లేక నిజంగా కట్టుదిట్టం చేస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?