తెరాస ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు తెరాస ఎమ్మెల్యేల గుండెల్లో కొత్త గుబులు రేపాయి. మరో మూడేళ్ల తరువాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందా? రాదా? అన్నదే ఆ గుబులు. దీనికి సహేతుకమైన కారణమే వుంది. …

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు తెరాస ఎమ్మెల్యేల గుండెల్లో కొత్త గుబులు రేపాయి. మరో మూడేళ్ల తరువాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వస్తుందా? రాదా? అన్నదే ఆ గుబులు. దీనికి సహేతుకమైన కారణమే వుంది. 

జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెరాస చాలా మంది సిటింగ్ లకు టికెట్ లు ఇవ్వలేదు. అయితే ఫలితాల్లో టికెట్ లు దక్కించుకున్న చాలా  మంది సిటింగ్ లు గెలవలేదు. ఈ విషయమే కార్యకర్తలు, నాయకులు, గెలిచిన కార్పౌరేటర్లతో కేటిఆర్ సమావేశం అయినపుడు చర్చకు వచ్చింది. 

సిటింగ్ లకు టికెట్ లు ఇవ్వడం అన్నది నష్టమే చేసింది అనే అర్ధం వచ్చేలా కేటిఆర్ కామెంట్ చేసారు. సాధారణంగా ప్రభుత్వంపై నెగిటివ్ ఓటు వున్నట్లుగానే అభ్యర్థులపై కూడా నెగిటివ్ ఓటు వుంటుంది. కొత్త అభ్యర్థి అయితే  ఈ నెగిటివిటీ కొంత తగ్గుతుంది. 

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ థియరీ కొంత పనిచేసినట్లు కనిపిస్తోంది. కేటిఆర్ కూడా ఆ సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగి అయిదేళ్లకే నెగిటివిటీ వస్తే, తెరాస ప్రభుత్వం ఏర్పాటై పదేళ్లు అవుతుంది వచ్చే ఎన్నికల వేళకు. అందువల్ల ఏర్పడే నెగిటివిటీని తగ్గించాలంటే కచ్చితంగా చాలా వరకు కొత్త మొహాలు కనిపించాల్సిందే. 

కేసిఆర్ కానీ అలా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చాలా మందికి టికెట్ లు రావు. ఎమ్మెల్యేలకు ఇదే లేటెస్ట్ టెన్షన్. అయితే ఇలా చేయడం కూడా అంత సులువైన టాస్క్ కాదు. ఎందుకంటే భాజపా రెడీగా వుంది. 

ఎక్కడిక్కడ నాయకులను చేర్చుకోవడానికి. మాజీ లయ్యే ఎమ్మెల్యేలకు టికెట్ లు ఇవ్వకపోయినా, కనీసం పార్టీలో చేర్చుకుని ఆదరిస్తుంది. వారు వ్యతిరేకంగా పని చేస్తే తెరాసకు కష్టం అవుతుంది.

మొత్తం మీద జిహెచ్ఎంసి ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

పవన్ మనసులో వున్నది ఆయనేనా?