తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బుజ్జగించడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఆరంభించినట్లుగా ఉంది. వంశీ పార్టీకోసం గట్టిగా పనిచేశారని, ఆయన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
Advertisement
తదుపరి పోరాటం సాగించాలని, ఇందుకు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ సమన్వయం చేస్తారని ఆయన తెలిపారు. వల్లభనేని వంశీ ఎక్కడా టిడిపిలో కొనసాగుతానని తన లేఖలో చెప్పకపోవడంతో ఇప్పుడు చంద్రబాబు బుజ్చగించే పనిలో పడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి.