వర్ల రామయ్య.. లోకేష్ కు చీమకుట్టనివ్వడే!

అధికారంలో ఉన్నప్పుడూ సోషల్ మీడియాను సహించలేకపోయారు. తమ మీద ఎవరైనా సెటైర్ వేస్తేవాళ్లు ఎక్కడ దొరుకుతారా? నొక్కుదామా… అన్నట్టుగా వ్యవహరించారు. అప్పుడు అనేకమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన సోషల్ మీడియా నెటిజన్లను…

అధికారంలో ఉన్నప్పుడూ సోషల్ మీడియాను సహించలేకపోయారు. తమ మీద ఎవరైనా సెటైర్ వేస్తేవాళ్లు ఎక్కడ దొరుకుతారా? నొక్కుదామా… అన్నట్టుగా వ్యవహరించారు. అప్పుడు అనేకమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన సోషల్ మీడియా నెటిజన్లను అరెస్టులు చేయించారు. విశేషం ఏమిటంటే.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియానే శత్రువుగా కొనసాగుతూ ఉన్నట్టుంది. సోషల్ మీడియాపై వారి ఫిర్యాదుల పరంపర కొనసాగుతూ ఉంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడ్డారు. దానిపై ఆ ఆ పార్టీ నేతలు స్వయంగా వచ్చి ఫిర్యాదులు చేసి ఆవేదన వ్యక్తంచేశారు. అయితే తమ విషయంలో ఎవరైనా సెటైర్లు వేసినా టీడీపీ సహించలేదు. వారిని అరెస్టులు చేయించింది.

అయితే ఇప్పుడు టీడీపీ చేతిలో అధికారం లేదు. అయినా సోషల్ మీడియా మీద ఫిర్యాదులు మాత్రం గట్టిగా చేస్తోంది. ఈ పనిలో ఉన్నారు వర్ల రామయ్య. తమ లోకేష్ మీద సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారని, ఆయనను కించపరుస్తూ ఉన్నారని వర్లరామయ్య కంప్లైంట్లు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఆయన పోలిస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. మళ్లీ ఆయన అదే పనిచేశారు.

ఎవరో అనామకులు పెట్టిన పోస్టును ఏదో చూపించి, దానిపై జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని వర్ల డిమాండ్ చేసేశారు! మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతల మీద దుష్ప్రచారాలు చేసినప్పుడు  ఇలాంటి వాళ్లు స్పందించలేదు. లోకేష్ వద్దకు వచ్చేసరికే వీళ్లు చాలా ఆవేశపడిపోతూ ఉన్నట్టున్నారు.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది