ఇంత అనుభవంలో నేర్చుకుంది ఇదేనా?

చంద్రబాబు మాటొస్తే తనకు నలభయ్యేళ్ల అనుభవం ఉన్నదని చెప్పుకుంటూ ఉంటారు. ఏళ్లు పరంగా చూస్తే నిజమే. కానీ  ఆయన  మాట్లాడే మాటలు గమనిస్తే.. ఇంత అనుభవం నిజమేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. అంత అనుభవం…

చంద్రబాబు మాటొస్తే తనకు నలభయ్యేళ్ల అనుభవం ఉన్నదని చెప్పుకుంటూ ఉంటారు. ఏళ్లు పరంగా చూస్తే నిజమే. కానీ  ఆయన  మాట్లాడే మాటలు గమనిస్తే.. ఇంత అనుభవం నిజమేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. అంత అనుభవం ఉన్న ఆయన అమాయకత్వంతో మాట్లాడుతున్నారా? అజ్ఞానంతో మాట్లాడుతున్నారా? అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇంతకూ ఆయన చెబుతున్నదేంటంటే… రాజధానిని ఎంపిక చేసుకోవడం వరకే రాష్ట్రానికి అధికారం ఉంటుందిట. దానిని మార్చడంలో రాష్ట్రానికి అధికారం ఉండదుట.!

ఇంత అనుభవంలో చంద్రబాబుకు రాజ్యాంగం గానీ, చట్టాలు గానీ తెలుసో లేదో మనకు తెలియదు. మొత్తానికి రాజధాని ఎంపిక అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన, వారి పరిధిలోని అనే అంశం ఇవాళ కేంద్రం రాతపూర్వకంగా చెబితేగానీ ఆయనకు తెలియలేదు. పార్లమెంటులో కేంద్రం ప్రకటన తర్వాత గానీ.. ఆయన గతంలో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిన సంగతి కూడా ప్రస్తావించనేలేదు. అంటే ఆయనకు ఆ సంగతి ఇన్నాళ్లూ గుర్తుకు రాలేదు.

ఇప్పుడు కేంద్రం ప్రకటన వచ్చిన తర్వాత… దానిని ప్రస్తావిస్తూ రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసే అధికారం మాత్రమే ఉంటుంది తప్ప.. మార్పు చేసే అధికారం ఉండదని అంటున్నారు. పైగా తమాషా ఏంటంటే.. గతంలో కేంద్రం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది గనుక.. ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని వారే ప్రశ్నించాలని ఆయన ఆశిస్తున్నారు. జగన్ ను కేంద్రం ఎందుకు ప్రశ్నించడం లేదు.. అంటూ వారికి ఏదో ఉద్దేశ్యాలను అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

తప్పులు అన్నీ తనవైపు పెట్టుకుని.. కేంద్రంమీద బురదచల్లుతూ తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించి గతంలో ఒకసారి చంద్రబాబు చాలా దారుణంగా భంగపడ్డారు. ఇప్పుడు మళ్లీ రాజధాని విషయంలో కేంద్రం మీదనే నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్రం ప్రస్తుతానికి పత్రికల్లో వార్తల ద్వారా తెలిసిందని మాత్రమే ప్రకటించింది.

రేపు శాసనసభలో పూర్తిగా బిల్లు పాసయిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం దానిని కేంద్రానికి పంపితే.. మళ్లీ కొత్తగా.. విశాఖనే ఎడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా తిరిగి నోటిఫై చేస్తుంది.ఇలాంటి బేసిక్ కామన్‌సెన్స్ విషయాలు కూడా తెలియకుండా.. నలభయ్యేళ్ల సీనియారిటీని చంద్రబాబు ఎలా సాధించాడా? అనేదే ప్రజలకు సందేహంగా ఉంది.

గూగుల్లో ఎంత సెర్చ్ చేసినా ఒక్క అమ్మాయితో కూడా లింకప్ రావట్లేదు