వారు పవన్ మొరాలకించడం కష్టమే!

కొత్తగా భాజపాతో పొత్తు పెట్టుకుని ఊరేగుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. ఎందుకు? ఈ సందేహం అందరికీ వస్తుంది. రాష్ట్ర  రాజకీయాల్లో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి,  ప్రధానంగా తన పరువు…

కొత్తగా భాజపాతో పొత్తు పెట్టుకుని ఊరేగుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. ఎందుకు? ఈ సందేహం అందరికీ వస్తుంది. రాష్ట్ర  రాజకీయాల్లో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి,  ప్రధానంగా తన పరువు కాపాడుకోవడానికి ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కేంద్రంలోని పెద్దల ద్వారా జగన్ వ్యతిరేక ప్రకటన చేయించడం అనేది ఆయన ముందున్న తక్షణ ప్రాధాన్యం. అయితే.. కేంద్ర పెద్దలు ఆయన మొరాలకిస్తారా? అనేది మాత్రం సందేహంగానే ఉంది. ఆయన ప్రస్తుతం ఆ ప్రయత్నం మీదనే ఢిల్లీ వెళ్తున్నారు.

2019 ఎన్నికల్లో ఏకంగా సీఎం అయిపోతానని భ్రమించి, పోటీచేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయి, గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా తనను ఖాతరు చేయకపోగా.. తన పార్టీకి సొంతంగా మనుగడ కష్టం అనే అభిప్రాయం రావడంతో.. ఢిల్లీకి పలుమార్లు తిరిగి, ఆ పర్యటనల గురించి అతి రహస్యం మెయింటైన్ చేస్తూ.. పవన్ ఎట్టకేలకు భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఒక శాతం ఓట్లు రాని ఆ పార్టీ, పవన్ తో మైత్రికి సంతోషంగానే ఒప్పుకుంది.

కానీ.. 50 శాతం ఓట్లున్న జగన్మోహన రెడ్డి స్నేహంగా ప్రవర్తిస్తుండే సరికి.. అటు కూడా మొగ్గారు. అది పవన్ జీర్ణించుకోలేకపోయాడు. ఈలోగా కేంద్ర కేబినెట్లో వైకాపా చేరుతుందనే పుకార్లు  ఆయనకు చిర్రెత్తించాయి. అలా జరిగితే ఎన్డీయేకు కటీఫ్ చెబుతా అని కూడా ప్రకటించారు.

ఇలాంటి నేపథ్యంలో తన కార్యశూరత్వాన్ని నిరూపించుకోవడానికి జగన్మోహనరెడ్డికి ఏదో ఒక రీతిగా కేంద్రంనుంచి షాక్ ఇప్పించాలనేది పవన్ ఎజెండా! రాజధాని అనేది అమరావతినుంచి ఎక్కడకూ తరలిపోదు అని పదేపదే ప్రజలకు హామీ ఇస్తున్న జగన్.. అందుకు అనుకూలంగా కేంద్రంలోని పెద్దల ద్వారా ఒక ప్రకటన చేయించాలని అనుకుంటున్నారు. కానీ ఆయన కోరిక తీరుతుందా? అనేది మాత్రం సందేహమే. సైనిక కుటుంబాల సంక్షేమ నిధికి రూ.కోటి చెక్కు ఇవ్వడం అనేది బయటకు కనిపించే ఎజెండా మాత్రమే అని పలువురు విశ్లేషిస్తున్నారు.

పవన్ ఇంకా గట్టిగా కోరుకుంటే.. కావలిస్తే.. దేవధర్, పురందేశ్వరి, కన్నా లాంటి వారి ద్వారా జగన్ పాలన వైఫల్యాలగురించి విమర్శలు చేయించగలం గానీ.. రాజధాని విషయంలో జోక్యం చేసుకోం అని కేంద్రం ఇండైరక్టుగా సంకేతాలు ఇస్తోంది. కానీ.. పవన్ మాత్రం పెద్దడిమాడ్లతోనే వారి వద్దకెళుతున్నారు. మరి సాధించుకు వస్తారో లేదో?

నితిన్ తో 'ఖుషీ' గా ఉంది