మహా విశాఖకు మహా ఆదాయం

మహా విశాఖ నగర పాలక సంస్థకు ఆదాయం దండీగా వస్తోంది. అది కూడా కరోనా టైమ్ లో. దాంతో అధికారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఆస్తి పన్నుల వసూలు అన్నదే అతి పెద్ద సమస్య.…

మహా విశాఖ నగర పాలక సంస్థకు ఆదాయం దండీగా వస్తోంది. అది కూడా కరోనా టైమ్ లో. దాంతో అధికారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఆస్తి పన్నుల వసూలు అన్నదే అతి పెద్ద సమస్య.

అయితే దీనికి మహా విశాఖ కార్పొరేషన్ మంచి ఉపాయమే కనిపెట్టింది. మొత్తం పన్నులు ఒకేసారి ఆస్తిపన్ను కడితే ఆ పన్నులో అయిదు శాతం రాయితీ ఇస్తామని ఆకర్షించే ఆఫర్ ప్రకటించడంతో జనాలు ఒక్కసారిగా టర్న్ అయ్యారు.

అంతే కేవలం మూడు వారాల వ్యవధిలోనే జీవీఎంసీకి యాభై కోట్ల పై చిలుకు ఆదాయం సమకూరింది. ఏప్రిల నెల ముగిసేలోగా ఈ జోరు వంద కోట్ల పై దాటుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

మొత్తానికి పన్నుల ద్వారా ఆదాయాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకోవడమే లోకల్ బాడీస్ కి బిగ్ టాస్క్. దాన్ని అలవోకగా సాధిస్తున్న జీవీఎంసీ సౌండ్ పార్టీ కావడానికి మరిన్ని కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తోంది. 

ఏది ఏమైనా ఆదాయం ఉంటేనే అభివృద్ధి కాబట్టి జీవీఎంసీ ఆలోచనలు ఇతర కార్పొరేషన్లకు, మునిసిపాలిటీలకు కూడా ఆదర్శం అనాల్సిందే.