ఏపీలో జగన్ సర్కార్ ఏమీ చేయలేదు, ఎవరికీ ఈ ప్రభుత్వం న్యాయం చేయడంలేదు. ఇది తెల్లారిలేస్తే విపక్షాలు అనే మాట. అయితే ఎవరికి ఏం చేసిందన్నది ఆయా లబ్దిదారులకే తెలుస్తుంది. వారు చెబితేనే అసలు విషయం జనాలకూ తెలుస్తుంది.
ఏపీలో మైనారిటీలకు జగన్ చేసినట్లుగా ఎవరూ చేయలేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ విశ్లేషించారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆయన మైనారిటీలను చాలా పార్టీలు హామీలు ఇచ్చాయి కానీ అమలు చేసింది. వారి మేలు చూసింది జగన్ ఒక్కరే అంటున్నారు.
మైనారిటేలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నా అంతకు మించి అన్ని రకాలైన పదవులలో వారిని తెచ్చి కూర్చోబెట్టిన ఘనత జగన్ దే అని ఆయన అంటున్నారు. ఒక విధంగా ఇది మైనారిటీలకు గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి అని కూడా ఆయన చెబుతున్నారు.
మైనారిటీలు ఏపీలో క్షేమంగా ఉన్నారు అంటే వైసీపీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల వల్లనేనని కూడా పేర్కొన్నారు. ఇక తాజాగా నామినేటెడ్ పదవుల పంపిణీలో కూడా మైనారిటీలకు పెద్ద పీట వేసిన ఘనత జగన్ దే అని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆ వర్గాన్ని వైసీపీ బాగానే సంతృప్తి పరచింది అనుకోవాలి.