కాపు కాసేది మేమే….

ఏపీలో ఇపుడు సామాజిక సమీకరణల మీద అన్ని పార్టీలూ దృష్టి సారించాయి. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారి మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా గట్టి…

ఏపీలో ఇపుడు సామాజిక సమీకరణల మీద అన్ని పార్టీలూ దృష్టి సారించాయి. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారి మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ అయితే ముందు కన్నా లక్ష్మీనారాయణను ఆ తరువాత సోము వీర్రాజు ని ఏపీ ప్రెసిడెంట్ గా తెచ్చింది కాపుల ఓట్ల కోసమే అని అంటారు. ఇక బీజేపీ జనసేన‌తో కూడా జట్టుకట్టింది.

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తామని బీజేపీ చెబుతోంది. ఏపీలో కాపులకు తాము అండగా ఉంటామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల మీద హాట్ కామెంట్స్ చేశారు.

కాపులు రాజకీయంగా నష్టపోయారని జీవీఎల్ అన్నారు. వారికి అన్ని విధాలుగా న్యాయం చేసే పార్టీయే బీజేపీ అని ఆయన చెప్పడం విశేషం. ఇక బీజేపీ ఆద్వర్యాన జరిగిన ప్రజాగ్రహ సభతో అటు టీడీపీ ఇటు వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టించామని చెప్పారు.

కేంద్రం ఏపీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోనని, ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తోందని జీవీఎల్ అంటున్నారు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం చలవేనని, అయితే వాటికి తమ పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవడం దారుణమని ఆయన అన్నారు. మొత్తానికి ఏపీలో కాపులను దువ్వేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది అనే చెప్పాలి. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.