స్టీల్ ప్లాంట్ పోరాట కధ కంచికేనా… ?

పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ సినీ స్టార్. ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తారు. వారు తరఫున నిలబడతారు అంటే ఇక కచ్చితంగా ప్రైవేట్ పరం కాకుండా ఆపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో అంటే…

పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ సినీ స్టార్. ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తారు. వారు తరఫున నిలబడతారు అంటే ఇక కచ్చితంగా ప్రైవేట్ పరం కాకుండా ఆపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో అంటే ఆ ఆశలు పూర్తిగా నీరు కారిపోయాయని చెప్పారు.

పవన్ గత రెండు నెలల్లో రెండు సార్లు స్టీల్ ప్లాంట్ పేరిట జనంలోకి వచ్చారు. ఒక మీటింగ్ విశాఖలో పెట్టి ప్లాంట్ కి మద్దతు ఇచ్చామని చెప్పారు. అయితే ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తున్నకేంద్రాన్ని ఏమీ అనకుండా వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తూ వారం రోజుల్లో అఖిల పక్షం వేయాలని డిమాండ్ చేశారు.

ఆ డెడ్ లైన్ ఎపుడో ముగిసిపోయింది. ఇపుడు మళ్ళీ మంగళగిరిలో ఆయన ఒక రోజు దీక్ష చేశారు. ఇపుడు కూడా ఆయన వైసీపీ మీదనే బాణాలు ఎక్కుపెట్టారు. కేంద్రాన్ని, మోడీని అసలు పల్లెత్తి విమర్శించలేదు. ఈ దీక్ష అయిపోయిన తరువాత ఆయన అనేక అంశాలు మాట్లాడారు, అందులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంతో కొంత ఉందంతే.

ఇక దీక్ష ముగిసింది. వాట్ నెక్స్ట్ అంటే ఏమో అనే అంటున్నారు. రాయలసీమ రైతుల గురించి పవన్ పోరాటం చేస్తారు అని అంటున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూని పక్కన పెట్టేసినట్లేనా. అంతే అనుకోవాలి. మొత్తానికి స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేనాని తాను కూడా ఏమీ చేయలేనని చెప్పేశారా అన్న మాటే వినిపిస్తోంది.

బీజేపీతో పొత్తును తెంచుకోలేక వారికి ఒక మాట అనలేక చేసే దీక్షలు ఎలాంటి ఫలితాలూ ఇవ్వవని స్టీల్ ఉద్యమ కారుల నుంచి వస్తున్న నిర్వేదపూరితమైన మాటలు. సో స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సింది ఎవరంటే కేవలం కార్మికులే. ఇదే సత్యం. ఇదే నిజం కూడా.